తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన సూపర్ హీరో సినిమా హనుమాన్.. ఈ సినిమా రిలీజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. అంతే కాదు ఏకంగా పాన్ ఇండియా రేంజిలో 300 కోట్ల పైగా వసూళ్లు రాబట్టింది..ఐతే ఈ సినిమాకు రెండో పార్ట్ ఉన్నట్లు ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమా ఎండింగ్ లో రెండో పార్ట్ కు సంబంధించి లీడ్ ఇచ్చాడు.. అంతే కాదు రెండో పార్ట్ జై హనుమాన్ టైటిల్ వస్తున్నట్లు ప్రకటించాడు.. పాన్ ఇండియా ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సూపర్ హీరో సీక్వెల్ “జై హనుమాన్” పై భారీ అంచనాలు ఉన్నాయి… ఈసారి ప్రశాంత్ వర్మ జై హనుమాన్ సినిమాను భారీ కథతో, భారీ విజువల్స్ తో వెండి తెరపై ఆడియెన్స్ కు సూపర్ ఎక్స్పీరియన్స్ ఉండేలాగా తెరకెక్కితున్నట్లు సమాచారం… “జై హనుమాన్” భారీ స్థాయిలో తెరకెక్కనుంది. ఈ సినిమాలో ప్రముఖ నటుడు కాంతార ఫేమ్ రిషబ్ శెట్టి హనుమాన్ పాత్రలో కనిపించనున్నారు. అయితే, తాజాగా మరో ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది—ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ కానుంది.. ఈ సినిమాలో పలు పాత్రల్లో స్టార్ హీరోలు క్యామియో రోల్లో కనిపించబోతున్నట్లు సమాచారం..









