కీర్తి సురేశ్ పెళ్లి తర్వాత వరుస సినిమాలు చేస్తూ తన హవా చూపిస్తుంది.., సినిమాల ఎంపికలో చురుగ్గా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఆమె ‘అక్క’, ‘రివాల్వర్ రీటా’ వంటి విభిన్నమైన సినిమాలతో బిజీగా ఉంది. ఇక, హిందీలో మరో ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. ఇప్పుడీ విషయంపై కొత్త సమాచారం చక్కర్లు కొడుతోంది. బాలీవుడ్‌లో ఓ బడా స్టార్ హీరో సినీమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం.. ఐతే స్టార్ హీరో మరెవరో కాదు రణ్‌బీర్ కపూర్.. రణ్‌బీర్ కపూర్‌తో కలిసి కీర్తీ సురేష్ నటిస్తున్నట్లు సమాచారం.. ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ ఐతే మాత్రం ఫాన్స్ కు పండగే అని చెప్పాలి.. అన్నీ అనుకున్నట్లు జరిగితే, ఈ సినిమా రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కనుంది తెలుస్తుంది…ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రాలేదు.









