ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న “డ్రాగన్” సినిమాపై రోజుకో అప్‌డేట్ బయటకొస్తుండడంతో ఆడియన్స్ లో భారీ హైప్ క్రియేట్ అవుతుంది.. ఈసారి ప్రశాంత్ నీల్ తన డ్రీమ్ హీరోతో డ్రీమ్ ప్రాజెక్ట్ ను ఊహకందని రేంజిలో యాక్షన్ మేకింగ్‌తో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది… ఐతే ఈ సినిమా నుండి ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోంది .
బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌తో స్పెషల్ సాంగ్ ప్లాన్ చేయడం సినిమా రేంజ్‌ను మరింత ఎలివేట్ చేయొచ్చు.. గతంలో కూడా ప్రశాంత్ తన సినిమాల్లో మాస్ అపీలు పెంచేలా స్పెషల్ సాంగ్స్‌కు ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి.. ఈసారి “డ్రాగన్” లో కూడా అలాంటి హైలైట్ సాంగ్ ఉండబోతుందనేది హాట్ టాపిక్ గా మారింది.. అలాగే ప్రశాంత్ నీల్ సినిమాకు చాలా టైం తీసుకొని స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేయడం, ఎన్టీఆర్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచే సినిమాగా తీర్చిదిద్దాలని అనుకోవడం అంచనాలను రెట్టింపు చేస్తోంది… ఐతే ఈ సినిమాను ఇండియన్ భాషలతో పాటు కొన్ని విదేశీ భాషల్లో కూడా పెద్ద ఎత్తున రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. రవి బస్రూర్ సంగీతం ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు భారీ ప్లస్ అవ్వనుంది.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా అధికారిక అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఐతే ఈసారి ఎన్టీఆర్ బర్త్ డేకి ఫస్ట్ లుక్ తో పాటు మరియు టైటిల్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం..









