ప్రొడ్యూసర్ నాగవంశీ ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ జోష్ లో ఉన్నారు. నాగవంశీ నిర్మించిన సినిమాలు వరుస హిట్లతో బాక్స్ ఆఫీసు దగ్గర మంచి వసూళ్లు రాబట్టి లాభాలు తెచ్చిపెడుతున్నాయి.. రీసెంట్ గా నాగవంశీ లక్కీ భాస్కర్ సినిమాతో భారీ హిట్ . ఇప్పుడు, “మ్యాడ్ స్వ్కేర్” సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా ప్రమోషన్లు ప్రస్తుతం జోరుగా జరుగుతున్నాయి, ఇంకా నాగవంశీ ఈ సినిమాలో ఒక పాత్ర కూడా పోషించాడు. అని సమాచారం…
ఇటీవల, నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న మైథలాజికల్ సినిమాపై స్పందించాడు.. ఈ సినిమా కథ మైథలాజికల్ అంశాలతో ఉంటుందని ఆయన చెప్పారు… ఈ కథ ఇప్పటి వరకు రాని , ఎవరికి తెలియని ఓ మైథలజీ కథ అని.. ఇప్పటి వరకు ఏ సినిమాలో రాని అంశాలను తీసుకొని త్రివిక్రమ్ కథను రూపొందిస్తున్నారని ఇంటర్వ్యూ లో చెప్పారు… ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ త్రివిక్రమ్ , అల్లు అర్జున్ కాంబో కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. నాగవంశీ చెప్పిన ఈ న్యూస్ త్రివిక్రమ్, బన్నీ కాంబో పై భారీ హైప్ తెచ్చింది..ప్రస్తుతం నాగవంశీ నిర్మించిన “మ్యాడ్ స్వ్కేర్” సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా హిట్ అయితే, మూడో పార్టు కూడా తీసే అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు.. అయితే, అల్లు అర్జున్-త్రివిక్రమ్ సినిమా పై అప్డేట్ ఆల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా వచ్చే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాల్లో టాక్..









