Search
Close this search box.

  వెంకీ – సూర్య సినిమాకు ముహూర్తం ఫిక్స్..?

తమిళ స్టార్ హీరో సూర్య కంగువా సినిమాతో ఇటీవలే ఆడియెన్స్ ముందుకు వచ్చాడు.. ఐతే ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర అనుకున్నంతా స్థాయిలో ఆడలేదు..ప్రస్తుతం సూర్య కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్లో వస్తున్న రెట్రో సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఐతే స్టార్ హీరో సూర్యకు తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.., తాజాగా తెలుగులో ఒక సినిమాను చేయబోతున్నారు అని సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అయ్యింది… వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా ఈ సినిమా రాబోతున్నట్లు సమాచారం.. , ఐతే వెంకీ అట్లూరి ఇటీవలే లక్కీ భాస్కర్ సినిమాతో హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు..ఐతే ఈ కాంబో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు ఫిల్మ్ సర్కిల్లో టాక్.. ఈ సినిమాలో సూర్య  సరసన హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్స్ ని తీసుకున్నారని సమాచారం కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు డ్రాగన్ గ్లామరస్ డాల్ కయాడు లోహర్ ఈ పాత్రలో కనిపించబోతున్నది అని తెలుస్తుంది.. అలాగే ఈ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు సమాచారం.. ఈ సినిమాను జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ చేయబోతున్నట్లు సమాచారం..

ఈ ప్రాజెక్ట్ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందనుండగా, సూర్య దేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించనున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు