Search
Close this search box.

  మరో భారీ మల్టీస్టారర్ సెట్ చేస్తున్న దిల్ రాజు..? హీరోలు ఎవరంటే..?

టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ సినిమాలు చేస్తూ.. హీరోలకు హిట్లు ఇస్తూ.. టాలీవుడ్ తనకంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు..గతంలో దిల్ రాజు బ్యానర్ లో సినిమాలు అంటే ప్రేక్షకుల్లో మరియు బిజినెస్ సర్కిల్స్‌లోనూ మినిమం గ్యారెంటీ ఉండేది. శ్రీ వెంకటేశ్వర సినీ క్రీయేటివ్స్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన సినిమాలు నిర్మించి పెద్ద హిట్లు ఇచ్చారు. కానీ ఇటీవల కాలంలో దిల్ రాజు నిర్మించిన సినిమాలు పెద్దగా విజయం సాధించలేకపోయాయి. దీంతో బయ్యర్లకు కూడా భారీ నష్టాలు ఎదురయ్యాయి.

 

అయితే, ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం”సినిమా, భారీ హిట్ కొట్టింది. గేమ్ ఛేంజర్ ఫ్లాప్ అయినా, “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా దిల్ రాజుకు పెద్ద లాభాలను తెచ్చిపెట్టింది. గేమ్ ఛేంజర్ నష్టాలను నుండి దిల్ రాజును బయట పడేసింది…

 

ఇప్పుడు, పాన్ ఇండియా స్థాయిలో మరో సూపర్ హిట్ కొట్టేందుకు దిల్ రాజు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.. గతంలో, తమిళ డైరెక్టర్‌ను నమ్మి భారీ డిజాస్టర్ ఎదురైన దిల్ రాజు, ఈసారి మలయాళ దర్శకుడితో సినిమా నిర్ణయించడానికి సిద్ధమైనట్లు సమాచారం.. “మార్కో” సినిమాతో భారీ హిట్ కొట్టిన దర్శకుడితో సినిమా నిర్మించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్ , దిల్ రాజు ఈ మలయాళ దర్శకుడిని టాలీవుడ్‌కు పరిచయం చేయనున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఇద్దరు హీరోలతో తెరకెక్కించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు