తెలంగాణ సర్కార్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసే వారి పై ఉక్కుపాదం మోపుతుంది… దీనికి సంబంధించిన వారికి హెచ్చరికలు జారి చేస్తూ అరెస్టులు చేస్తున్నారు.. విద్యార్థుల జీవితాల పై బెట్టింగ్ యాప్స్ ఘోర ప్రభావం చూపడంతో …వీటి పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది… ఎవరైతే సోషల్ మీడియా వేదికగా వీటిన ప్రమోషన్ చేస్తున్నారో వాళ్ళను అరెస్టు చేస్తున్నారు..రీసెంట్ గా నిందితుల్లో హర్షసాయి, విష్ణుప్రియ, ఇమ్రాన్‌ఖాన్, రీతూ చౌదరి, బండారు శేషయాని సుప్రీత, కిరణ్‌గౌడ్, అజయ్, సన్నీయాదవ్, సుధీర్ సహా పలువురు సెలబ్రిటీలు, టీవీ నటులు ఉన్నారు.పంజాగుట్ట పోలీసులు 11 మంది యూట్యూబర్లపై కేసులు నమోదు చేసిన విషయం పట్ల ఇది పెద్ద పరిణామం. ఈ కేసులు చైనా ఆధారిత బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ వల్ల విద్యార్థుల జీవితాలను ప్రతికూలంగా ప్రభావితం చేయడం, డబ్బు నష్టాలు వంటి సమస్యలను కలిగించాయని పేర్కొనబడింది. పోలీసులు ఎటువంటి సాక్ష్యాల ఆధారంగా విచారణ చేపట్టి, నిందితులపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.
ఈ కేసుల ద్వారా, గేమింగ్ చట్టాలు, ఐటీ చట్టం వంటి సంబంధిత చట్టాల పరిధిలో చర్యలు తీసుకోవడం, ఈ రకమైన అక్రమ కార్యకలాపాలు జరగకుండా అరికట్టడం పోలీసుల ప్రాధాన్యం… నోటీసులు జారీచేసి విచారించడం, అవసరమైతే అరెస్ట్‌లు చేయడం సున్నితంగా జరగాలని పోలీసులు భావిస్తున్నారు…
ఈ వ్యవహారం చాలా మంది యూట్యూబర్లపై ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఈ తరహా సంఘటనలపై మరింత చట్టపరమైన అవగాహన పెరగడం అవసరం…









