తెలుగు సినిమా డాషింగ్ దర్శకుడు పూరి జగన్నాధ్ తనదైన స్టైల్లో సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నారు.. కానీ పూరీ జగన్నాథ్ గత కొంత కాలంగా వరుసగా వచ్చిన డిజాస్టర్లతో ఆయనకు ఒక హిట్ సినిమా రావడం కష్టంగా మారింది.. ఈసారి ఎలాగైనా బౌన్స్ బ్యాక్ అవ్వాలని పూరీ జగన్నాథ్ గట్టిగా ట్రై చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఐతే తన నెక్ట్స్ సినిమాను నాగార్జునతో చేస్తున్నాడని సోషల్ మీడియాలో కొన్ని వార్తలు తెగ వైరల్ అయ్యాయి.. కానీ ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది.. తమిళ నటుడు విజయ్ సేతుపతికి పూరి జగన్నాధ్ ఒక కథ చెప్పాడని… విజయ్ సేతుపతి కథ నచ్చడంతో ఒకే చెప్పినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుుంది… విజయ్ సేతుపతి అటు హీరోగా, విలన్ గా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీ గా ఉన్నాడు.. విజయ్ సేతుపతి కథ డిమాండ్ చేస్తే ఎలాంటి పాత్రనైనా చేయడానికి రెడీ గా ఉంటాడు.. విజయ్ సేతుపతి బలమైన కథ ,కథాంశం ఉంటేనే సినిమాకు కమిట్ అవుతాడు… ఐతే పూరీ జగన్నాథ్ ఈసారి తన ట్రాక్ మార్చి ఓ కొత్త కథను విజయ్ సేతుపతికి చెప్పి ఒప్పించినట్లు సమాచారం… ఆ కథలో పాత్ర విజయ్ సేతుపతికి బాగా నచ్చిందట.. అందుకనే ఒప్పుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్ .. ఈ కాంబినేషన్ తెలుగు, తమిళ ప్రేక్షకులలో పలు ఊహాగానాలు నింపుతోంది. విజయ్ సేతుపతి, తన ఇతర ప్రాజెక్టులను పక్కనపెట్టి ఈ సినిమాకు కాల్షీట్స్ అందించాలని చెప్పడంతో.. స్క్రిప్ట్ ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు.. చూడాలి మరి ఈసారి అయినా పూరీ జగన్నాథ్ కమ్ బ్యాక్ ఇస్తాడో.. లేదో..









