టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లు వస్తుంటారు పోతుంటారు.. కానీ కొందరి హీరోయిన్స్ ను మాత్రమే ఆడియెన్స్ ఎప్పటికీ మరచిపోలేరు.. ఆ హీరోయిన్స్ యాక్టింగ్ వల్లో వాళ్లు చేసిన సినిమాల వల్లో కొందరు హీరోయిన్స్ ను ఆడియెన్స్ ఎప్పటికీ మరిచిపోలేరు.. ఆ రోజుల్లో మహానటి సావిత్రి, ఆ తరువాత అతిలోక సుందరి శ్రీదేవి,అందలనాటి సౌందర్య ఈ హీరోయిన్స్ చనిపోయిన వీళ్ళను మాత్రం ఆడియెన్స్ ఇప్పటికీ కూడా గుర్తుకుపెట్టుకున్నారు.. ఐతే ఈ హీరోయిన్స్ లో అందలానటి సౌందర్య మరణానికి సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..
సౌందర్య హీరోయిన్ గా టాలీవుడ్ బిగ్ స్టార్స్ మెగాస్టార్, జగపతి బాబు, వెంకటేష్, మోహన్ బాబు తో సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకుంది.. కట్టు బొట్టుతో సాంప్రదాయంగా కనిపిస్తూనే అభిమానుల ఆరాధ్య దేవతగా పేరు సొంతం చేసుకుంది సౌందర్య.. ఫ్యామిలీ హీరోయిన్గా పేరు దక్కించుకున్న సౌందర్య.. మోహన్ బాబు సరసన ఎన్ని సినిమాలలో నటించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అంతేకాదు వీరిద్దరి మధ్య మంచి అవినాభావ సంబంధం కూడా ఉందనే వార్తలు అప్పట్లో వినిపించేవి. ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఎంతో పేరు దక్కించుకున్న ఈమె కెరియర్ పీక్స్ లో ఉండగానే.. రాజకీయాలలోకి అడుగుపెట్టిన సౌందర్య.. ఎన్నికల సందర్భంగా బిజెపి పార్టీకి మద్దతు పలుకుతూ ఆంధ్రప్రదేశ్లో ప్రసంగించడానికి బెంగళూరు నుంచి బయలుదేరిన సమయంలో అనుకోకుండా హెలికాప్టర్ బ్లాస్ట్ అయింది..ఈ ప్రమాదంలో సౌందర్య మరణించిన విషయం తెలిసిందే.ఈమె మరణ వార్త సినీ ఇండస్ట్రీని ఒక్కసారిగా కుదిపివేసింది. ఇప్పటికీ సౌందర్యలేని లోటును ఎవరు తీర్చలేకపోతున్నారు..
ఐతే సోషల్ మీడియాలో ఇప్పుడు సౌందర్య మరణం గురించి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది.. అదేంటంటే సడన్గా సౌందర్య మరణానికి కారణం మోహన్ బాబు అంటూ ఒక వ్యక్తి కలెక్టర్ ఆఫీస్ లో కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది.సినీనటి సౌందర్యను హత్య చేయించింది మంచు మోహన్ బాబు అంటూ ఖమ్మం రూరల్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు..సౌందర్యకు శంషాబాద్ జల్ పల్లిలో ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ ఉందని, దానిని విక్రయించమని నటుడు మోహన్ బాబు అడగగా నిరాకరించింది..దీనిపై కక్ష పెంచుకున్న మోహన్ బాబు బెంగళూరు నుంచి తెలంగాణ పార్టీ ప్రచారానికి వస్తున్న వారిని సాక్ష్యాలు లేకుండా హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించాడని కంప్లయింట్ లోనూ ఆ వ్యక్తి పేర్కొన్నాడు..ఇప్పటికే మోహన్ బాబు ఫ్యామిలీ గొడవల వల్ల సతమతమవుతున్నారు..ఈ టైం లో దీని పై మోహన్ బాబు ఎలా స్పందిస్తాడో..









