పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇప్పటికే ప్రభాస్ 5 సినిమాల్లో నటిస్తున్నాడు.. దీనికి తోడు రీసెంట్ గా హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో రాక్షస అనే సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.. కానీ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేశాక. కొత్త సినిమాలను స్టార్ట్ చేసే పనిలో ప్రభాస్ ఉన్నట్లు తెలుస్తుంది.. ప్రభాస్ ప్రస్తుతం నీల్ డైరెక్షన్లో సలార్ 2, హను రాఘవపూడి డైరెక్షన్లో “ఫౌజీ” సినిమాలను చేస్తున్నాడు.. కానీ ప్రభాస్ వీటి కన్నా ముందు మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమా చేస్తున్నట్లు అందరికీ తెలిసిందే.. ఈ సినిమా హార్రర్ కామెడీ గా రాబోతుంది.. ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు.. మాళవిక మోహన్, నిధి అగర్వాల్ , నటిస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమాను ఏప్రిల్ రిలీజ్ చేస్తామని అప్పట్లో మేకర్స్ ప్రకటించారు.. ఏప్రిల్ దగ్గరికి వస్తుండడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.. కానీ రాజాసాబ్ టీం నుండి ఇంత వరకు ఎలాంటి అప్డేట్ లేదు.. ఈ సినిమా నుండి గతంలో ఓ గ్లింప్స్ రిలీజ్ చేసారు.. ఆ తరువాత ఈ సినిమా నుండి ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు.. ఈ సినిమా నుండి ఒక చిన్న అప్డేట్ కూడా బయటకి రాకపోవడంతో సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి తెగ వైరల్ చేస్తున్నారు.. ఈ సినిమా షూటింగ్ సైలెంట్ జరుతున్నట్లు సమాచారం.. ఇంకో 10% షూటింగ్ బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తుంది.. మరో వైపు డైరెక్టర్ మారుతికి విఫ్ఎక్స్ టీం ను కూడా చేంజ్ చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది..డైరెక్టర్ మారుతి అనుకున్నా ఔట్ పుట్ రాకపోవడంతో విఫ్ఎక్స్ టీం ను చేంజ్ చేశారట.. ఈ కారణం వల్లే సినిమా ఇంకా లేట్ అవుతుందాని సమాచారం.
అన్ని పనులు పూర్తి అయ్యాకే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.. ఐతే ఈ సినిమా దసరా పండగకు రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్..ఈ సినిమాను పిపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీ.జి విశ్వప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.









