Search
Close this search box.

  పవన్ కళ్యాణ్ ప్లాప్ సినిమా రీ రిలీజ్..? ఎప్పుడంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ హవా నడుస్తుంది.. ఒక హీరో సంబధించిన పుట్టిన రోజు సందర్భంగా ఆ హీరో అల్ టైం క్లాసిక్ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.. ఈ సినిమాలు రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ రావడంతో.. ప్రొడ్యూసర్స్ అందరు ఆ స్టార్ హీరో సినిమా ఫ్లాప్,హిట్ తో సంబంధ లేకుండా రీ రిలీజ్ చేస్తున్నారు.. ఫ్లాప్ సినిమాలకు కూడా భారీ కలెక్షన్స్ వస్తున్నాయి..ఐతే ఈ ట్రెండ్ కొన్ని రోజుల క్రితం లేదు.. కానీ మహేష్ బాబు సూపర్ హిట్ సినిమా “ఒక్కడు” సినిమాను మేకర్స్ ను 4k లో రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు..ఈ సినిమా రీ రిలీజ్ అయ్యి కలెక్షన్స్ బాగా రావడంతో.. ఇక్కడి నుండి రీరిలీజ్ సినిమాలు హవా కొనసాగుతోంది.. దీని తర్వాత మిగతా హీరో ఫ్యాన్స్ ఆ హీరో సినిమాలను రీ రిలీజ్ చేయాలంటూ ప్రొడ్యూసర్స్ ను సోషల్ మీడియాలో డిమాండ్ చేయడంతో.. ప్రొడ్యూసర్స్ కి డబ్బులు రావడంతో సినిమాలు రీ రిలీజ్ లు చేస్తున్నారు.. మెగాస్టార్ ఇంద్ర సినిమా, పవర్ స్టార్ జల్సా, ఎన్టీయార్ సింహాద్రి, రామ్ చరణ్ ఆరంజ్, అల్లు అర్జున్ దేశముదురు, ప్రభాస్ ఛత్రపతి సినిమాలు రీరిలీజ్ అయ్యాయి.. రీసెంట్ గా టాలీవుడ్ అల్ టైం క్లాసిక్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు రీ రిలీజ్ అయ్యింది. ఈ రీ రిలీజ్ లు వల్ల ఫ్యాన్స్ కూడా మరోసారి ఆ సినిమాను చూసి ఎంజాయ్ చేయడం తో పాటు ఆ సినిమాలోని కొన్ని సీన్స్ రీ క్రియేట్ చేయడం వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో రీ రిలీజ్ సినిమాల హవా నడుస్తుంది.. కొందరు ఆ సినిమాను థియేటర్లో మిస్ అయ్యిన ఫ్యాన్స్ మళ్ళీ రీ రిలీజ్ చూడడానికి వస్తున్నారు.. ఐతే అలాంటి ఓ రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఓ నిర్మాత ప్రకటించిండు..ఆ నిర్మాత ఎవరో కాదు బండ్ల గణేష్.. పవన్ కళ్యాణ్ హీరోగా తీన్ మార్ మూవీని బండ్ల గణేష్ నిర్మించాడు.ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర ఫ్లాప్ గా నిలిచింది.. ఇన్ని రోజుల తరువాత ఫ్యాన్స్ కోరిక మేరకు ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్లు బండ్ల గణేశ్ ప్రకటించాడు..మరి ఈ తీన్ మార్ మూవీని ఎప్పుడు రీ రిలీజ్ చేస్తారో చూడాలి..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు