Search
Close this search box.

  నాని ప్యారడైజ్ కథ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..? బాగా ప్లాన్ చేశారు..?

నాని హీరోగా ఓదెల శ్రీకాంత్ డైరెక్షన్లో వచ్చిన దసరా సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. ఈ సినిమా రూరల్ బ్యాక్ డ్రాప్ లో రస్టిక్ గా వచ్చింది.. ఈ సినిమాలో నాని ఊర మాస్ పాత్రలో కనిపించి ఆడియాన్స్ ను ఫిదా చేశాడు.. ఈ సినిమా బాక్స్ ఆఫీసు దగ్గర 100 కోట్ల కలెక్షన్ రాబట్టి నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించింది.. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఏ హీరోతో సినిమా చేస్తాడో అని ఆడియాన్స్ లో ఆసక్తి పెరిగింది.. కానీ డైరెక్టర్ శ్రీకాంత్ మాత్రం తన రెండో సినిమా కూడా నాని తోనే చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేశాడు.. ఐతే ఈ క్రేజీ కాంబోలో వచ్చే సినిమా ఈసారి ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు.. దసరాను మించి ఈ ప్యారడైజ్ సినిమా ఉంటుందని నాని కొన్ని ఇంటర్వ్యూలో చెప్పాడు.. కానీ రీసెంట్ గా వచ్చిన ది పారడైజ్ రా స్టేట్మెంట్ అంటూ వచ్చిన గ్లింప్స్ చూసి ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు.. ఎందుకంటే నాని ఇంతవరకు చెయ్యని ఓ పాత్ర.. వేయని ఓ గెటప్ అలాగే నాని సినిమాలో ఇంత వరకు లేని బూతు పదాలు.. అన్ని ది ప్యారడైజ్ గ్లీంప్స్ లోనే ఉన్నాయి.. ఒక్క గ్లింప్స్ తోనే ఈ సినిమా సోషల్ మీడియాను షేక్ చేసింది.. ఆ గ్లింప్స్ లో వచ్చే లేడీ వాయిస్ ఓవర్ గూస్ బంప్స్ తెప్పించే రేంజిలో ఉంది.. ఆ బూతు పదం విని ఫ్యాన్స్ అందరూ ఇది నాని సినిమానేనా అని షాక్ అవుతున్నారు.. ఐతే ఈ సినిమా కథ 1950 నాటి హైదారాబాద్ కథ అని తెలుస్తుంది.. ఈ సినిమాల్లో నాని ఓ వేశ్య కొడుకు పాత్రలో కనిపించబోతున్నాట్లు సమాచారం.. అంతేకాదు ఈ సినిమా మొత్తం 8 భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు..చూడాలి మరి నాని ఓదెల గ్లింప్స్ తోనే ఈ రేంజిలో షాక్ ఇచ్చారంటే..! ఇంకా ఈ సినిమా ఏ రేంజిలో ఉండబోతుందో..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు