అక్కినేని అఖిల్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన స్పై థ్రిల్లర్ సినిమా “ఏజెంట్”. అఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కింధి ఈ సినిమా.. ఈ సినిమాను ఏ కే ఎంటర్టైన్మెంట్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు.. ఈ సినిమా కోసం అఖిల్ తన బాడీ కూడా పెంచాడు.. స్పై థ్రిల్లర్ యాక్షన్ గా ఈ సినిమా రావడంతో ఈ సినిమా పై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి.. ఈ సినిమాలో మమ్ముట్టి లాంటి భారీ స్టార్ కాస్ట్ ఉండడంతో ఈ సినిమా పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.. ఈ సినిమాలో అఖిల్ రా ఏజెంట్ గా నటించాడు..ఐతే సినిమా రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయ్యింది.. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా బాక్స్ ఆఫీసు వద్ద నిలిచింది.. దీంతో ప్రొడ్యూసర్స్ భారీగా నష్ట పోయారు.. ఏ సినిమా అయినా రిలీజ్ అయిన నెల తరువాత ఓటిటిలోకి వస్తుంది.. కానీ అఖిల్ ఏజెంట్ సినిమా మాత్రం సినిమా రిలీజ్ అయ్యి రెండు సంవత్సరాలు అయిన కూడా ఓటిటిలోకి రాలేదు.. అపుడప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమా ఓటిటిలోకి వస్తుందాంటూ వార్తలు వచ్చాయి.. ఎట్టకేలకు ఓటిటిలోకి ఈ సినిమా వస్తుంది అని .. సోనీ లివ్ అధికారంగా ప్రకటించింది.. ఈ నెల 14న ఈ సినిమా ఓటిటిలోకి రాబోతుంది.. ఈ సినిమాలో హీరోయిన్ గా సాక్షి వైద్య నటించింది..చూడాలి మరి ఈ సినిమా ఓటిటీలో ఎలా ఆకట్టుకుంటుందో..
