మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ హీరో విజయ్ వర్మ ప్రేమలో ఉన్నట్లు అప్పట్లో సోషల్ మీడియాలో న్యూస్ తెగ వైరల్ అవుతుంది.. ఎక్కడికి వెళ్లిన ఈ ఇద్దరూ కలసి వెళ్లవారు.. దాంతో వీరి పై వచ్చిన రుమార్స్ స్ట్రాంగ్ మారాయి..తమన్నా హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ, అప్పుడప్పుడు కొన్ని ఐటెం సాంగ్ లు కూడా చేసింది.. విజయ్ వర్మ తెలుగులో నాని హీరోగా వచ్చిన MCA సినిమాలో విలన్ గా నటించాడు.. ఆ తరువాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ బిజీ ఉన్నాడు.. నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘లస్ట్ స్టోరీస్ 2’ షూటింగ్ సమయంలో తమన్నా, విజయ్ ల మధ్య ప్రేమ చిగురించిందని, అప్పటి నుండి వీళ్ళ ఇద్దరిమధ్య ప్రేమ పుట్టిందని సమాచారం.. అప్పటి నుండి వీళ్లిద్దరూ ఎక్కడికి వెళ్ళినా జంటగా వెళ్ళేవారు.. వీళ్ళు ప్రేమలో ఉన్నట్లు కొన్ని ఇంటర్వ్యూ లో చెప్పారు.. కానీ డేటింగ్ లో ఉన్నట్లు కొన్ని బాలీవుడ్ మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి.. రేపోమాపో పెళ్లి వార్త చెబుతారని ఆశించిన ఫ్యాన్స్ కు వీళ్ళు షాకింగ్ న్యూస్ చెప్పారు.. ఈ జంట విడిపోతున్నట్లు న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది… తమన్నాకు విజయ వర్మ మధ్య బ్రేకప్ అయ్యిందనే న్యూస్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.. కానీ ఈ విషయం పై ఈ జంట ఇంతవరకు స్పందించలేదు.. చూడాలి మరి ఈ జంట నిజంగా విడిపోయిందా లేదా..
