టాలీవుడ్ లో తెరకెక్కుతన్న మోస్ట్ అవైటెడ్ సినిమాలో SSMB 29 ఒకటి.. దర్శకధీరుడు SS.రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.. ఈ సినిమా కోసం యావత్ సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు.. ఈ సినిమా ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు సమాచారం.. ఐతే ఈ సినిమాకు సంబంధించిన ఏ విషయాన్ని కూడా రాజమౌళి బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు.. ఈ సినిమాను దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్తో KL నారాయణ మూర్తి నిర్మిస్తున్నాడు.. దీనిని ఇండియన్ సినీ చరిత్రలో ఇప్పటి వరకు చూడాని భారీ విజువల్ వండర్ గా ఈ సినిమాను తెరకెక్కుతున్నట్లు సమాచారం.. ఐతే ఈ సినిమా పూజ కార్యక్రమాలను సీక్రెట్ గా చేసారు.. అలాగే మొదటి షెడ్యూలను కూడా రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ భారీ సెట్ లో కంప్లేటి చేసారు..ఇప్పుడు ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కోసం రాజమౌళి & టీం ఒడిశాకు వెళ్ళారు.. ఇక ఎయిర్‌పోర్ట్‌లో మహేష్ బాబుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. అంతే కాదు ఈ సినిమాకు సంబంధించి ఎప్పటినుండో వస్తున్న రూమర్ కూడా చెక్ పడింది. ఆ రూమర్ ఏంటంటే మలయాళ వర్సటైల్ హీరో పృథ్వీ రాజ్ సుకుమార్ SSMB 29లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.. ఐతే ఎయిర్‌పోర్ట్‌లో మహేష్ బాబుతో పాటు పృథ్వీ రాజ్ సుకుమార్ కనబడడంతో ఆ న్యూస్ నిజమే అని ఈ కన్ఫర్మ్ అయ్యింది..ఈ సినిమాలో కొంత మంది హాలీవుడ్ నటులు కూడా నటిస్తున్నట్లు సమాచారం.. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుంది.. చూడాలి మరి ఈసారి ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ ను బద్దలు కొడుతుందో..
