ప్రముఖ సింగర్ కల్పన నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సింగర్ కల్పన హాస్పిటల్లో చికిత్స తీసుకుంటుంది..డాక్టర్స్ తన పరిస్థితి నిలకడగా ఉందని చెప్తున్నారు.. కానీ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం చేయడానికి కారణాలు ఏమైయుంటాయి అని అందరూ ఆలోచిస్తున్నారు.. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పాడడానికి కారణం కూతురుతో గొడవేనని సమాచారం.. సింగర్ కల్పన పెద్ద కూతురు కేరళలో ఉంటుంది.. ఐతే నిన్న కల్పన తన పెద్ద కూతురికి ఫోన్ చేసి హైదరాబాద్ కు రమ్మని చెప్పిందంట.. ఐతే నేను హైదరాబాద్ రాను అని తన పెద్ద కూతురు తెగేసి చెప్పిందట.. తరువాత వాళ్లిద్దరి మధ్య చాలా పెద్ద గొడవ జరగడంతో.. కూతురు అలా మాట్లాడడంతో మనస్తాపానికి గురైన కల్పన..మధ్యాహ్నం మూడు గంటల సమయంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం.. ఈ విషయాలు అన్నీ పోలీసుల దర్యాప్తులో వెళ్ళడైనట్లు సమాచారం.. సాయంత్రం చెన్నై నుంచి భర్త ప్రసాద్ కల్పనకు ఫోన్ చేయగా కల్పన లిఫ్ట్ చేయలేదు..పలుమార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో విల్లా సెక్రటరికి కాల్ చేసి చెప్పానని, ఆయన వెళ్లి తలుపు తట్టినా తెరవలేదని ప్రసాద్ వివరించారు.. పోలీసులకు ఫోన్ చేయగా వారు వచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసేసరికి బెడ్ రూం లో కల్పన అపస్మారక స్థితిలో ఉన్నారు.. వెంటనే హాస్పిటకు తరలించారట..









