బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి.. దాంతో ఈ కాంబో పై ఆడియాన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.. ఈ కాంబోలో వచ్చే సినిమాకు కోసం ఆడియాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఈ కాంబో లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి.. ఆ తరువాత చాలా రోజుల తర్వాత ఈ కాంబో లో వచ్చిన అఖండ సినిమా భారీ హిట్ గా నిలిచింది.. ఐతే బోయపాటి శ్రీను అఖండ సినిమా క్లైమాక్స్ లో ఈ సినిమాకు రెండో పార్ట్ ఉందని ప్రకటించారు.. ఆ తరువాత అఖండ సీక్వెల్ ను అధికారకంగా ప్రకటించారు.. BB 4 ను పేరుతో ప్రకటించి.. అఖండ సినిమా సీక్వెల్ పనులు మొదలు పెట్టారు.. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సీన్స్ మహకుంభ మేళాలో షూట్ చేశారనే న్యూస్ తెగా వైరల్ అయింది.. ఈ సినిమాలో విలన్ పాత్రలో అదిపిని శెట్టీ నటిస్తున్నట్లు ప్రకటించారు.. అప్పట్లో అల్లు అర్జున్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో వచ్చిన సరైనోడు సినిమాలో విలన్ గా అది పిని శెట్టి నటించి మెప్పించారు.. ఈ సినిమాలో బాలకృష్ణ అఘోర పాత్రలో మరోసారి కనబడుతున్నారు.. ఐతే సినీ వర్గాల్లో ఓ న్యూస్ తెగ చక్కర్లు కొడుతుంది.. అదేంటంటే ఈ సినిమాకు పార్ట్ 3 కూడా ఉండబోతున్నట్లు సమాచారం.. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ బాగా లెంగ్త్ ఉండడంతో. ట్రిం చేయడం వల్ల సినిమా ఫీల్ పోతుందాని బోయపాటి ఆలోచించి ఈ సినిమాను మరో పార్ట్ తీయడానికి ఫిక్స్ అయినట్లు సమాచారం.. ఇది కనుక నిజమైతే బాలయ్య ఫ్యాన్స్ కు పండగే.ఈ సినిమా మ్యూజిక్ తమన్ అందిస్తున్నారు..









