Search
Close this search box.

  బాహుబలి సరసన బచ్చన్ భామ..?

హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే వరుస సినిమాలతో తెలుగులో బిజీగా మారిపోయింది. బాలీవుడ్ నుండి వచ్చిన ఈ భామ.. టాలీవుడ్ లో తన జోరు చూపిస్తుంది.. టాలీవుడ్ కు రవితేజ సినిమా “మిస్టర్ బచ్చన్” సినిమా తో తెలుగు తెరకు పరిచయం అయింది. హరీష్ శంకర్ దర్శకత్వంలో బాలీవుడ్ “రైడ్” సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమా. మిస్టర్ బచ్చన్ టైటిల్ తో హరీశ్ శంకర్ కొన్ని మార్పులతో ఈ సినిమాను తెరకెక్కించారు.. ఈ సినిమా విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన భాగ్య శ్రీ బోర్సే అందానికి తెలుగు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు.. దాంతో ఈ భామకు తెలుగులోక వరుస ఆఫర్స్ వస్తున్నాయి.. ఇటీవలే రామ్ పోతినేని హీరోగా మహేష్ బాబు డైరెక్షన్లో వస్తున్న సినిమా లో హీరోయిన్ గా నటిస్తుందా.. ఐతే ఈ భామ మరో భారీ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందాని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఆ హీరో ఎవరో కాదు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయిందాని సమాచారం. ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా మైథాలజీ సినిమా రాబోతుంది.. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది.. ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ సెట్ లో ప్రభాస్ టెస్ట్ లుక్ కూడా పూర్తి అయింది.. ఐతే ఈ సినిమాలోనే భాగ్య శ్రీ బోర్సే ను హీరోయిన్ గా తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.. దాంతో నెటిజన్స్ ఈ ప్రభాస్ భాగ్య శ్రీ బోర్సే కాంబో అదిరిపోతుంది అంటూ అప్పుడే వైరల్ చేస్తున్నారు.. ఇది నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే దాకా వేచి ఉండాలి.. ఒక వేళ ఈ కాంబో నిజమైతే భాగ్య శ్రీ లక్కీ ఛాన్స్ కొట్టిందని చెప్పాలి..

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు