Search
Close this search box.

  జగన్ కు షాక్.. షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ..?

February 4, 2025 8:10 AM | Aditya369 News

జగన్ కు షాక్.. షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఊహించని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాను రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన వైసిపి రాజ్యసభ మాజీ సభ్యుడు విజయ్ సాయి రెడ్డి ఇక తాను వ్యవసాయం చేసుకోవటానికే పరిమితం అవుతానని చెప్పి తాజాగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తో భేటీ అయ్యారు. హైదరాబాద్లోని లోటస్పాండ్ లో వైయస్ షర్మిల నివాసంలో ఈ భేటీ జరిగినట్టు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.

విజయ సాయి రెడ్డికి వైఎస్ షర్మిలకు మధ్య దాదాపు మూడు గంటల పాటు సమావేశం జరిగినట్టు టాక్ వినిపిస్తుంది. మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో షర్మిల ఇంటికి విజయ సాయి రెడ్డి వెళ్లారని మధ్యాహ్నం అక్కడే భోజనం చేశారని అనేక రాజకీయ అంశాల పైన మూడు గంటల పాటు షర్మిల తో చర్చించారని తెలుస్తోంది.

షర్మిలతో సాయిరెడ్డి భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చ

మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన సోదరి షర్మిల మధ్య కుటుంబ, రాజకీయ సంబంధాలు గత సార్వత్రిక ఎన్నికల ముందు నుంచి గందరగోళంగా ఉన్న విషయం తెలిసిందే. ఉప్పు, నిప్పులా ఇద్దరి మధ్య విబేధాలు ఉన్నాయి. ఇక ఈ సమయంలో తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని చెప్పిన విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి షర్మిలను కలవడం రాజకీయ వర్గాలలో రకరకాల చర్చలకు కారణంగా మారింది.

సాయిరెడ్డి షర్మిలతో కలిసి పని చేస్తారా?

ప్రస్తుత రాజకీయాల పైన చర్చించిన అనంతరం విజయసాయిరెడ్డి భవిష్యత్తులో షర్మిల తో కలిసి పని చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా కూడా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే షర్మిల తో సయోధ్య నేపథ్యంలో జగన్ విజయసాయిరెడ్డిని షర్మిల వద్దకు పంపించినట్టుగా కూడా మరో ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విజయ సాయి రెడ్డి షర్మిలతో భేటీ కావడం రాజకీయ వర్గాలలో చర్చకు కారణమైంది.

సాయిరెడ్డి ఏం చేస్తారు? షర్మిల ఏం చేయబోతున్నారు?

ఊహించని నిర్ణయం తీసుకున్న సాయి రెడ్డి భవిష్యత్తులో ఏం చేయబోతున్నాడు. వైఎస్ షర్మిల వైసీపీ నుంచి బయటకు వస్తున్న విజయ సాయి రెడ్డి వంటి నేతల విషయంలో ఏమి నిర్ణయం తీసుకోబోతున్నారు.. వంటి అనేక అంశాలపై ప్రస్తుతం రాజకీయ వర్గాలలో చర్చ జోరుగానే సాగుతుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు