Search
Close this search box.

  ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ పై నటి అంజలి ఏమన్నారంటే…!

January 28, 2025 12:33 PM | Aditya369 News

‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ పై నటి అంజలి ఏమన్నారంటే…!

హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో 'గేమ్ ఛేంజర్' సినిమా ఫలితంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా... నటి అంజలి స్పందించారు.

సినిమా బాగోలేదని తనతో ఎవరూ చెప్పలేదన్నారు. మంచి సినిమా చేశావని చెప్పారని తెలిపారు. ఓ నటిగా తన బాధ్యతను నెరవేర్చానన్నారు. కొన్ని చిత్రాలను లేదా పాత్రలను బాగా నమ్మి చేస్తామని వెల్లడించారు. అలాంటి వాటిలో ఈ సినిమాలో పోషించిన పాత్ర కూడా ఒకటి అన్నారు. మంచి సినిమా అని ప్రేక్షకులు చెప్పారని, అంతవరకు చాలన్నారు. మిగిలిన అంశాల గురించి మాట్లాడాలంటే సమయం పడుతుందన్నారు.

కాగా, విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన 'మదగజరాజ' చిత్రం ఈ నెల 12న తమిళంలో విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా ఈ నెల 31న తెలుగులో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈరోజు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ సినిమా ఫలితంపై అంజలికి ప్రశ్న ఎదురైంది.

హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో ‘గేమ్ ఛేంజర్’ సినిమా ఫలితంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… నటి అంజలి స్పందించారు.

సినిమా బాగోలేదని తనతో ఎవరూ చెప్పలేదన్నారు. మంచి సినిమా చేశావని చెప్పారని తెలిపారు. ఓ నటిగా తన బాధ్యతను నెరవేర్చానన్నారు. కొన్ని చిత్రాలను లేదా పాత్రలను బాగా నమ్మి చేస్తామని వెల్లడించారు. అలాంటి వాటిలో ఈ సినిమాలో పోషించిన పాత్ర కూడా ఒకటి అన్నారు. మంచి సినిమా అని ప్రేక్షకులు చెప్పారని, అంతవరకు చాలన్నారు. మిగిలిన అంశాల గురించి మాట్లాడాలంటే సమయం పడుతుందన్నారు.

కాగా, విశాల్, అంజలి, వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన ‘మదగజరాజ’ చిత్రం ఈ నెల 12న తమిళంలో విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ సినిమా ఈ నెల 31న తెలుగులో విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఈరోజు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గేమ్ ఛేంజర్ సినిమా ఫలితంపై అంజలికి ప్రశ్న ఎదురైంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు