Search
Close this search box.

  గ్రూప్-1 మెయిన్స్ తేదీలను ప్రకటించిన ఏపీపీఎస్సీ..

January 22, 2025 11:06 AM | Aditya369 News

గ్రూప్-1 మెయిన్స్ తేదీలను ప్రకటించిన ఏపీపీఎస్సీ..

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నేడు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల తేదీలను ప్రకటించింది. మే 3 నుంచి 9వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. గ్రూప్-1 మెయిన్స్ కు 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి తెలిపారు. గ్రూప్-1 మెయిన్స్ కు 4,496 మంది అర్హత పొందినట్టు వివరించారు. ఈసారి మెయిన్స్ ప్రశ్నాపత్రాన్ని ట్యాబ్ లలో ఇవ్వాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.

2023 డిసెంబరులో 89 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. 2024 మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వహించారు. అయితే, ప్రిపేర్ అయ్యేందుకు మరింత సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో మెయిన్స్ పరీక్షలు మేలో నిర్వహించాలని నిర్ణయించారు. విశాఖ, అమలాపురం, విజయవాడ, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు