Search
Close this search box.

  జనవరి 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. కారణం అదేనా..?

January 9, 2025 10:01 AM | Aditya369 News

జనవరి 10 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్.. కారణం అదేనా..?

మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెండింగ్ బకాయిలు చెల్లించాలని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు వైద్య సేవలు నిలిపివేసి ఆందోళన బాట పట్టిన విషయం తెలిసిందే. ఇక ఇదే క్రమంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆరోగ్య శ్రీ పథకం కింద అందించే వైద్య సేవలు జనవరి 10వ తేదీ నుంచి నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నట్టు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు వెల్లడించాయి.

ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిల కోసం నెట్వర్క్ ఆస్పత్రుల డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో గత 12 నెలల నుంచి పెండింగ్ బకాయిలు చెల్లించడం లేదని పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలిపివేస్తామని నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశాయి. గత ఏడాదికాలంగా బకాయిలు చెల్లించకపోవడంతో తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నామని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి.

ఆరోగ్యశ్రీ వైద్యసేవలు బంద్.. ప్రభుత్వానికి అల్టిమేటం

ఈ మేరకు ఆరోగ్యశ్రీ సిఈఓ కు ఈమెయిల్ ద్వారా సమాచారాన్ని కూడా పంపించాయి. తమ సమస్యలు పరిష్కరించకపోతే జనవరి 10వ తేదీ నుంచి రాష్ట్రంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ వైద్య సేవలను నిలిపివేస్తామని వారు ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. ఆరోగ్యశ్రీ హెల్త్ స్కీమ్ లో మాత్రమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల హెల్త్ స్కీమ్, జర్నలిస్టు హెల్త్ స్కీం లలోను ప్రభుత్వం భారీగా బకాయిలు ఉందని వారు చెబుతున్నారు.

వెయ్యి కోట్ల బకాయిలు ఉన్నాయంటున్న ఆరోగ్య శ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1000 కోట్లకు పైగానే బకాయిలు ఉన్నాయని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ప్రైవేట్ ఆస్పత్రులు వెల్లడించాయి. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 9 నెలల బకాయిలు చెల్లించకుండా పెండింగ్లో పెట్టగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి ఆ బకాయిలు మరింత పెరిగాయని చెబుతున్నారు. 672 కోట్ల రూపాయలు పెండింగ్ ఉందని ఇక ఇప్పటివరకు మొత్తం 1000 కోట్ల రూపాయలకు పెండింగ్ బకాయిలు చెల్లించాల్సి ఉందని వారు చెబుతున్నారు.

ప్రభుత్వ వాదన ఇలా

అయితే ప్రభుత్వం గత ఏడాది కాలంలోనే నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపు 820 కోట్లను విడుదల చేసినట్లుగా చెబుతోంది. గతంలో ఉన్న పెండింగ్ బకాయిలతో పాటు కొత్త బిల్లులు కూడా క్లియర్ చేశామని ప్రభుత్వం అంటుంది. ఇక ప్రస్తుతం ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు 400 కోట్ల రూపాయలకు మించి ఉండవని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.

జనవరి 10వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్

ఏదేమైనప్పటికీ ప్రభుత్వానికి ప్రైవేటు ఆసుపత్రులకు మధ్య ఆరోగ్య శ్రీ బకాయిల విషయంలో చర్చ జరిగి ఒక నిర్ణయానికి రాకపోతే జనవరి 10వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నెట్వర్క్ ఆసుపత్రులలో నిలిచిపోనున్నాయి. ఇదే జరిగితే ఆరోగ్య శ్రీ సేవలు పొందే నిరుపేదలు ఇబ్బంది పడాల్సి వస్తుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore