Search
Close this search box.

  ఏపీకి నరేంద్ర మోడీ వరాల జల్లు..

January 9, 2025 9:50 AM | Aditya369 News

ఏపీకి నరేంద్ర మోడీ వరాల జల్లు..

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వరాలను ఇచ్చారు. విశాఖలో 2.85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తామన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నామని విశాఖలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు లక్ష్యం: మోదీ

దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యపాత్ర పోషించడమే కాదు ఇక్కడి ప్రజలు కూడా కొత్త అభివృద్ధికి సిద్ధంగా ఉన్నారని ఏపీలో ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు.

2047 నాటికి 2.5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించడానికి, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేరుకోవడానికి కేంద్రం లోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తుందని అన్నారు.

చంద్రబాబుతో కలిసి లక్ష్యాలను సాధిస్తాం

60 ఏళ్ల విరామం తర్వాత దేశంలో మూడవసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పిన మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే ఏపీలో తన తొలి అధికారిక కార్యక్రమమని వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అద్భుతమైన స్వాగతం తనను అమితంగా ఆకట్టుకుందని మోదీ తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి మాటను గౌరవిస్తానని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తాను భరోసా ఇస్తున్నానని, కలిసికట్టుగా చంద్రబాబు లక్ష్యాలను సాధిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

చంద్రబాబుకు ప్రధాని మోదీ కితాబు

దేశ అభివృద్ధిలో ఏపీ కీలక పాత్ర పోషించడమే కాకుండా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్నారు. దేశానికి ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరును ప్రశంసించారు. చంద్రబాబు ప్రతి మాటలో అభివృద్ధి, సంకల్ప స్ఫూర్తి ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ఏపీ అభివృద్ధి తమ విజన్ అని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి దాదాపు 2.5 ట్రిలియన్ డాలర్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ వెల్లడించారు.

ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం

ఏపీ ప్రతి లక్ష్యంలో ఎన్డీఏ ప్రభుత్వం భుజం భుజం కలిపి పని చేస్తుందని, లక్షల కోట్ల పథకాలను ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నామని తెలిపారు. తాము కొత్తగా ప్రారంభిస్తున్న ఈ ప్రాజెక్టులతో ఏపీ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. ఏపీ ఐటీ, టెక్నాలజీకి కేంద్రంగా ఉందని, నూతన భవిష్యత్తు సాంకేతికతలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

విశాఖ అగ్రశ్రేణి నగరంగా మారుతుంది

గ్రీన్ హైడ్రోజన్ అభివృద్ధి చెందుతున్న క్షేత్రమని ఏపీని కొనియాడారు. ప్రపంచంలోని అతి కొద్ది నగరాలలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే సదుపాయం ఉన్న అగ్రశ్రేణి నగరంగా విశాఖపట్నం నిలుస్తుందని అన్నారు. దీని వల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. అంతకు ముందు విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. దీంతో రాష్ట్ర దీర్ఘకాలిక డిమాండ్‌ ను నెరవేర్చినట్లు అయింది.

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోదీ

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం, పూడిమడకలో NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ - గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు కూడా నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 19 వేల 500 కోట్ల రూపాయల విలువైన రోడ్డు, రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్ పార్కుకు శంకుస్థాపన చేశారు.

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ వరాలను ఇచ్చారు. విశాఖలో 2.85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఎల్లవేళలా సహకరిస్తామన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్రప్రదేశ్ గా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యంగా పెట్టుకున్నామని విశాఖలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు లక్ష్యం: మోదీ

దేశ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యపాత్ర పోషించడమే కాదు ఇక్కడి ప్రజలు కూడా కొత్త అభివృద్ధికి సిద్ధంగా ఉన్నారని ఏపీలో ప్రగతి పరుగులు తీస్తుందని చెప్పారు.

2047 నాటికి 2.5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని సాధించడానికి, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ చేరుకోవడానికి కేంద్రం లోని ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తుందని అన్నారు.

చంద్రబాబుతో కలిసి లక్ష్యాలను సాధిస్తాం

60 ఏళ్ల విరామం తర్వాత దేశంలో మూడవసారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని చెప్పిన మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే ఏపీలో తన తొలి అధికారిక కార్యక్రమమని వెల్లడించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అద్భుతమైన స్వాగతం తనను అమితంగా ఆకట్టుకుందని మోదీ తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతి మాటను గౌరవిస్తానని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తాను భరోసా ఇస్తున్నానని, కలిసికట్టుగా చంద్రబాబు లక్ష్యాలను సాధిస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

చంద్రబాబుకు ప్రధాని మోదీ కితాబు

దేశ అభివృద్ధిలో ఏపీ కీలక పాత్ర పోషించడమే కాకుండా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందన్నారు. దేశానికి ఆంధ్రప్రదేశ్ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరును ప్రశంసించారు. చంద్రబాబు ప్రతి మాటలో అభివృద్ధి, సంకల్ప స్ఫూర్తి ప్రతిబింబిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. ఏపీ అభివృద్ధి తమ విజన్ అని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ 2047 నాటికి దాదాపు 2.5 ట్రిలియన్ డాలర్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ వెల్లడించారు.

ఏపీకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నాం

ఏపీ ప్రతి లక్ష్యంలో ఎన్డీఏ ప్రభుత్వం భుజం భుజం కలిపి పని చేస్తుందని, లక్షల కోట్ల పథకాలను ఇచ్చి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తున్నామని తెలిపారు. తాము కొత్తగా ప్రారంభిస్తున్న ఈ ప్రాజెక్టులతో ఏపీ అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. ఏపీ ఐటీ, టెక్నాలజీకి కేంద్రంగా ఉందని, నూతన భవిష్యత్తు సాంకేతికతలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.

విశాఖ అగ్రశ్రేణి నగరంగా మారుతుంది

గ్రీన్ హైడ్రోజన్ అభివృద్ధి చెందుతున్న క్షేత్రమని ఏపీని కొనియాడారు. ప్రపంచంలోని అతి కొద్ది నగరాలలో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసే సదుపాయం ఉన్న అగ్రశ్రేణి నగరంగా విశాఖపట్నం నిలుస్తుందని అన్నారు. దీని వల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. అంతకు ముందు విశాఖపట్నంలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయానికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. దీంతో రాష్ట్ర దీర్ఘకాలిక డిమాండ్‌ ను నెరవేర్చినట్లు అయింది.

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన ప్రధాని మోదీ

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం, పూడిమడకలో NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ – గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు కూడా నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 19 వేల 500 కోట్ల రూపాయల విలువైన రోడ్డు, రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్ డ్రగ్స్ పార్కుకు శంకుస్థాపన చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore