Search
Close this search box.

  మళ్లీ అఘోరీ ఎంట్రీ.. టోల్ ప్లాజా దగ్గర హల్ చల్..!

January 7, 2025 7:50 PM | Aditya369 News

మళ్లీ అఘోరీ ఎంట్రీ.. టోల్ ప్లాజా దగ్గర హల్ చల్..!

ఏపీలో మరోసారి లేడీ అఘోరీ ఎంటర్ అయ్యారు. గతంలో రాష్ట్రంలోని పలు దేవాలయాలకు వెళ్లి రచ్చ రచ్చ చేసిన లేడీ అఘోరీ మరోసారి ఇక్కడికి వచ్చారు. తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చే జాతీయ రహదారిపై ఉన్న చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద లేడీ అఘోరీ ప్రత్యక్షం కావడంతో ఆమెను చూసేందుకు వాహనదారులు కాసేపు అక్కడే ఆగిపోయారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని ఆమెను అక్కడి నుంచి పంపేశారు.

సంక్రాంతి వేళ ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద ఈ రష్ ఇంకా ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కారులో బయలుదేరిన అఘోరీ చిల్లకల్లు టోల్ ప్లాజా నుంచి రాష్ట్రంలోకి వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ పోలీసులు ఆమెను అక్కడే ఆపారు. దీంతో పోలీసులపై అఘోరీ చిందులు వేస్తూ కనిపించారు.

lady aghori re-enters into ap Hungama at chillakallu toll plaza

పోలీసులు ఆమెను అదుపు చేసేందుకు ప్రయత్నించినా లేడీ అఘోరీ శాంతించలేదు. పోలీసులపై ఫోన్లో ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించగా ఆమె సెల్ ఫోన్ ను వారు తీసుకున్నారు. దీంతో లేడీ అఘోరీ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కాసేపు ఈ రచ్చ కొనసాగింది. జనం గుమికూడుతుండటంతో పోలీసులు కూడా ఏం చేసేది లేక ఆమెను అక్కడి నుంచి పంపేసినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి సంక్రాంతికి ఏపీలో ఆలయాలను మరోసారి చుట్టేసేందుకు లేడీ అఘోరీ బయలుదేరారా లేక మరేదైనా కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్నారా అనేది తెలియరాలేదు.

లేడీ అఘోరీ గతంలోనూ తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల హంగామా సృష్టించారు. ఆలయాల్లో నిబంధనలు ఉల్లంఘించి దర్శనాలు చేసుకుంటానని పట్టుబట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. పోలీసుల్ని సైతం లెక్కచేయకుండా వారితో వాగ్వాదాలకు దిగడం, ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటానని బెదిరించడం వంటి చర్యలకు దిగారు. అయితే చాలా సార్లు పోలీసులు, అధికారులు ఆమెకు నచ్చజెప్పి దర్శనాలకు అనుమతించడం, ఇతరత్రా ఇబ్బందులు లేకుండా చూశారు. అయినా ఇప్పటికీ అఘోరీ తీరు మారలేదు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు