Search
Close this search box.

  గురి మార్చిన షర్మిల- కొత్త డిమాండ్..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేస్తూ వస్తోన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత్రి వైఎస్ షర్మిల తన గురి మార్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ముందు కొత్త డిమాండ్ పెట్టారు.

 

రాష్ట్రంలోని గ్రూప్ 1 అభ్యర్థుల వైపు నిలిచారామె. గ్రూప్ 2, డిప్యూటీ ఈవో పోస్టుల ఎంపికలో అనుసరించిన 1:100 విధానాన్ని, గ్రూప్ 1 మెయిన్స్‌లో కూడా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1 మెయిన్స్‌లోనూ ఇదే నిష్పత్తిని పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. జీవో నంబర్ 5 ప్రకారం 1:100 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసే అధికారం ఏపీపీఎస్సీకి ఉందని గుర్తు చేశారు.

 

జీవో నంబర్ 5 ప్రకారం 1:100 రేషియో ప్రకారం తమకు అవకాశం ఇవ్వమని గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు అడగడంలో న్యాయం ఉందని పేర్కొన్నారు. 89 పోస్టులకు ఇచ్చిన 1:50 రేషియో ద్వారా 4,450 మంది మెయి‌న్స్‌కు అర్హత పొందారని, 1:100 రేషియో ప్రాతిపదికన ఎంపిక చేయడం వల్ల అదనంగా మరో 4,450 మంది అభ్యర్థులకు అవకాశం దక్కుతుందని షర్మిల అన్నారు.

 

గ్రూప్ 2, గ్రూప్ 1 పరీక్షల మధ్య సమయం తక్కువగా ఉండటం, సిలబస్ మధ్య వ్యత్యాసం, కొత్త సిలబస్ అని చెప్పి పాత సిలబస్ లోనే పరీక్షలు నిర్వహించడం లాంటి కారణాలతో నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తోన్నారని షర్మిల తెలిపారు. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న గ్రూప్ 1 ఉద్యోగాల్లో ఇప్పుడు అవకాశం దక్కకపోతే ఇప్పట్లో ఇక నోటిఫికేషన్ ఉండదని అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని ఆమె చెప్పారు.

 

ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ను కలిసి విజ్ఞప్తి చేసినా ప్రభుత్వానికి పట్టింపు లేదని అభ్యర్థులు ఆవేదనకు గురవుతున్నారని, మెయిన్స్ షెడ్యూల్ విడుదల కాకముందే వాళ్ల విజ్ఞప్తులను పరిశీలించి, పరిగణనలోకి తీసుకోవాలని, న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని షర్మిల పేర్కొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు