కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో గొల్లప్రోలు జగనన్న కాలనీలో పవన్ విస్తృతంగా పర్యటించారు. వరద ముంపు బాధితులతో ఆయన మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. భవిష్యత్తులో వరద ముంపు నుండి ఎలా కాపాడాలో ఆ విధమైన చర్యలు తీసుకుంటామని పవన్ బాధితులకు హామీ ఇచ్చారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన ఇన్చార్జ్ శ్రీనివాస్ పాల్గొన్నారు









