Search
Close this search box.

  రూ.500 కే గ్యాస్ సిలిండర్.. రేవంత్ సర్కార్ శుభవార్త..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500 కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నారు. రేషన్ కార్డులు ఉన్నవారే ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా 39 లక్షల కుటుంబాలను అర్హులుగా గుర్తించారు. సరైన వివరాలను నమోదు చేయనివారిని అనర్హులుగా నిర్ణయించారు.

వివరాలు సరిచేసినవారికి కూడా ప్రజలు గ్యాస్ సిలిండర్ కు సంబంధించిన యునిక్ ఐడీ ఇవ్వవకపోవడంవల్ల రాయితీని పొందలేకపోతున్నారు. అయితే సరైన వివరాలను ఇవ్వనివారు ప్రజాపాలన కేంద్రాల్లో తిరిగి వివరాలు అందిస్తే వారిని అర్హులుగా నిర్ణయించనుంది. ఇలాంటివారు 4.60 లక్షల మంది ఉండగా, వారంతా వివరాలను తిరిగి సమర్పించారు. ప్రస్తుతం వీరికి కూడా రూ.500కే సిలిండర్ అందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 44.10 లక్షల కుటుంబాలకు రాయితీ సిలిండర్లు అందుతున్నాయి. అంతేకాకుండా ప్రభుత్వం మరో నిర్ణయం కూడా తీసుకుంది. రాయితీ సొమ్మును లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో వేయాలంటే కనీసం నాలుగు రోజుల సమయం పడుతోంది. అయితే రెండురోజుల్లోగా వీరి ఖాతాల్లో సొమ్ము జమ చేయాలనే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నారు. అధికారులకు ఆదేశాలు కూడా జారీచేశారు.

కేంద్ర మంత్రికి వివరాలందజేసిన కమిషనర్ తాము తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్ కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కలిసి తెలియజేశారు. తమ రాష్ట్రం చెల్లించే రాయితీ సొమ్మును వినియోగదారుల ఖాతాల్లో రెండురోజుల్లోపల జమచేయాలని కోరారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టడంలో ఆరు గ్యారంటీలు కీలక పాత్ర పోషించాయి. ప్రతి నెలా మహిళలకు రూ.2వేల ఆర్థిక సాయం, రూ.500 సిలిండర్, రైతు భరోసా కింద రూ.15వేలు, ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాభరోసా కార్డు, నెలకు రూ.4వేల చొప్పున చేయూత పింఛన్లు ఆ పార్టీకి అధికారాన్ని కట్టబెట్టాయి

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు