Search
Close this search box.

  తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్..

July 29, 2024 7:41 AM | Aditya369 News

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్..

తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కొత్త అధ్యక్షుడిగా భరత్ భూషణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయనను డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిగా సభ్యులు ఎన్నుకున్నారు. దిల్ రాజు పదవి కాలం ముగియడంతో ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.

అయితే, ఈసారి ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవిని డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి ఇచ్చారు. గతేడాది సినీ నిర్మాత దిల్ రాజుకు అవకాశం కల్పించారు. ఆయన పదవీ కాలం ముగియడంతో ఎన్నికలు నిర్వహించారు. రెండేళ్లకోసారి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు నిర్వహిస్తుంటారు. అధ్యక్ష పదదికి ఠాగూర్ మధు పోటీ చేశారు. ఇందులో భరత్ 29 ఓట్లు రాగా, ఠాగూర్ 17 ఓట్లు వచ్చాయి.

మరోవైపు, ఉపాధ్యక్ష పదవికి అశోక్ కుమార్, వైవీఎస్ చౌదరి పోటీపడగా.. అశోక్ కుమార్ ఎన్నికయ్యారు. అశోక్ కుమార్‌కు 28 ఓట్లు.. వైవీఎస్ చౌదరికి 18 ఓట్లు పోలయ్యాయి. అయితే ఉపాధ్యక్షుడిగా నిర్మాతల నుంచి ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష, ఉపాధ్యక్షుడిని 48 మంది సభ్యులు ఎన్నుకుంటారు. ఇందులో ప్రొడ్యూసర్లు, ఎగ్జిబ్యూటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో సెక్టార్‌లోని సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 46 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు