భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కు మంచి రోజులు వచ్చాయి. కేంద్రంలో మోడీ సారధ్యంలోని భారతీయ జనతాపార్టీకి మొన్నటి ఎన్నికల్లో కేవలం 240 సీట్లు మాత్రమే వచ్చాయి. దీంతో మిత్రపక్షాలపై ఆధారపడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తన ఆలోచనా తీరును మార్చుకున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను ప్రయివేటు సంస్థలకు అమ్మడానికి బదులుగా నిధులను కేటాయించి బలోపేతం చేయడంపై దృష్టిపెట్టారు.
లక్షల సంఖ్యలో బీఎస్ఎన్ ఎల్ కు వస్తున్న వినియోగదారులు అందులో భాగంగానే మొన్నటి బడ్జెట్ లో బీఎస్ఎన్ఎల్ కు రూ.82,916 కోట్లు కేటాయించారు. అంతేకాకుండా ఈనెల మూడోతేదీ నుంచి జియో, ఎయిర్ టెల్ సంస్థలు తమ టారిఫ్ ఛార్జీలను భారీగా పెంచాయి. ప్రతి ప్లాన్ పై 25 శాతం నుంచి 30 శాతం వరకు ధరలను పెంచారు. దీంతో వినియోగదారులు తక్కువ ధరలకే టారిఫ్ లు అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ వైపు దృష్టిసారించారు. ఈ మూడు వారాల వ్యవధిలో జియో నుంచి లక్షల సంఖ్యలో వినియోగదారులకు బీఎస్ఎన్ఎల్ కు పోర్టు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే మరింతమంది వినియోగదారులను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ చౌకైన ప్లాన్ ను తీసుకువచ్చింది. దీంతో జియో, ఎయిర్ టెల్ హడలిపోతున్నాయి.
అన్నీ ఏడాది వ్యాలిడిటీ రూ. 1198 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. దీని వ్యాలిడిటీ 365 రోజులు. ఈ పథకం కింద నెలకు 3జీబీ డేటాతోపాటు 30 ఎస్ఎంఎల్ లు, 300 నిముషాల వాయిస్ కాలింగ్ సౌకర్యం ఉంది. రూ.1999 విలువ చేసే మరో ప్రీపెయిడ్ ప్లాన్ ఉంది. ఇది కూడా 365 రోజులు చెల్లుబాటు అవుతుంది. ఏడాదిపాటు 600 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు ఉన్నాయి. రూ.2999 ధరలో మరో ప్లాన్ ఉంది. 365 రోజుల వ్యాలిడిటీతోపాటు ప్రతిరోజు 3జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్ లు, అన్ లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఇస్తోంది.