Search
Close this search box.

  నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో భారీ నోటిఫికేషన్..

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు టెక్నీషియన్ పోస్టుల కోసం బంపర్ రిక్రూట్‌మెంట్‌ను విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 9 మార్చి 2024 నుండి ప్రారంభమైంది.

ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrbcdg.gov.in లేదా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ప్రాంతీయ వెబ్‌సైట్ ద్వారా 8 ఏప్రిల్ 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు RRB జారీ చేసిన నోటిఫికేషన్‌ను చదివిన తర్వాత మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం సమర్పించిన దరఖాస్తు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా RRB టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ 1092 పోస్టులను, టెక్నీషియన్ గ్రేడ్ IIIలో మొత్తం 8092 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు.

విద్యార్హత..

టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్/కంప్యూటర్ సైన్స్/ఐటీ మొదలైన వాటిలో B.Sc డిగ్రీని చేసి ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ III పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ డిగ్రీతో పాటు 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి..

టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్ కోసం దరఖాస్తుదారు వయస్సు 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. టెక్నీషియన్ గ్రేడ్ III కోసం 18 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వనున్నారు.

దరఖాస్తు రుసుము

జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ. 500 దరఖాస్తు రుసుము చెల్లించాలి. SC/ST, Ex-Servicemen, PWBD, మహిళలు, లింగమార్పిడి, మైనారిటీ లేదా ఆర్థికంగా వెనుకబడిన తరగతుల అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ. 250 మాత్రమే చెల్లించాలి.

ఎంపిక ప్రక్రియ ?

ఈ పోస్టులకు దరఖాస్తుదారులను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-I (CBT-I), కంప్యూటర్ బేస్డ్ టెస్ట్-II (CBT-II), డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

CBT-I పరీక్షా సరళి..

టెక్నీషియన్ సీబీటీ-1 పరీక్షలో మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్‌నెస్, కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి 75 ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 1 గంట ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/3 నెగిటివ్ మార్కులు. ఈ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన మరింత సమాచారం కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో జారీ చేసిన నోటిఫికేషన్‌ను పరిశీలించవచ్చు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు