Search
Close this search box.

  బీజేపీ కొత్త చీఫ్ ఎంపిక మరింత ఆలస్యం..! ఎందుకంటే..??

బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు ఎవరు? ఎంపిక ఎందుకు ఆలస్యమవు తుంది? బలమైన నెట్‌వర్క్ ఉన్న బీజేపీలో.. అధ్యక్షుడు ఎంపిక వెనుక అసలేం జరుగుతోంది? సీనియర్ నేతకు పగ్గాలు అప్పగిస్తారా? లేక యువ నేత కోసం ఎదురుచూస్తున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

బీజేపీ అగ్ర నాయకత్వం ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి జాతీయ అధ్యక్షుడ్ని ఎంపిక చేయాలని నిర్ణయి స్తోంది. ఒకవైపు వివిధ రాష్ట్రాల ఎన్నికలు, మరోవైపు ఆరోగ్య‌ శాఖ బాధ్యతలు చూడడం జేపీ నడ్డాకు కష్టంగా మారింది. వీలైనంత త్వరగా ఆయనను పార్టీ బాధ్యతల నుంచి రిలీవ్ చేయాలని ఆలోచన చేస్తోంది.

ఆగస్టు ఒకటి నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రాథమిక సభ్యత్వ నమోదు ఉండనుంది. సెప్టెంబర్ 16 నుంచి 30 వరకు క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ జరగనుంది. నవంబర్‌లో మండల, జిల్లా చీఫ్‌ల నియా మకం ఉండబోతోంది. అంతా అనుకున్నట్లు జరిగితే డిసెంబర్‌లో రాష్ట్రాధ్యక్షుల ఎంపికతోపాటు నడ్డా స్థానంలో కొత్త చీఫ్‌ రానున్నట్లు తెలుస్తోంది.

బీజేపీ పార్టీ రాజ్యాంగం ప్రకారం ప్రతీ సభ్యుడు తొమ్మిదేళ్లకు ఒకసారి సభ్యత్వాన్ని పునరుద్దరించుకోవాలి. ఈ కార్యక్రమం తర్వాత కొత్త అధ్యక్షుడి కోసం కసరత్తు మొదలుపెట్టనుంది. డిసెంబర్ ఒకటి నాటికి వివిధ రాష్ట్రాల అధ్యక్షులు ఎన్నిక కానున్నారు. దాదాపు 50 శాతం పూర్తి కాగానే కొత్త జాతీయ అధ్యక్షుడ్ని ఎంపిక చేయాలనే ఆలోచన చేస్తోంది.

అధ్యక్షుడి ఎంపికలో ఈసారి బీసీ వర్గానికి పెద్ద పీఠ వేయాలని కమలనాధుల ఆలోచన. 2029 ఎన్నికలకు ఇప్పుటి నుంచే పక్కాగా స్కెచ్ వేస్తున్నారు. ఈ క్రమంలో బీసీ కార్డును తెరపైకి తెచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాదిలో పార్టీ బలపపడంతో ప్రయార్టీ వారికి ఇస్తే బాగుంటుందనే చర్చ జరుగుతోంది. ఉత్తరాదిలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మరోవైపు యూపీ ఎన్నికల ఉండడంతో ఆ పార్టీ తర్జనభర్జన పడుతోంది.

కేంద్రంలో ఉన్న సీనియర్ నేతకు కొత్త అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారా? లేక వేరే రాష్ట్రానికి చెందిన వ్యక్తిని తీసుకుంటారా? అనేదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మొత్తానికి ఎప్పుడులేని విధంగా కొత్త అధ్యక్షుడు ఎంపిక బీజేపీకి ఈసారి కత్తిమీద సాముగా మారిందనే చెప్పువచ్చు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు