Search
Close this search box.

  ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతం… అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయి: చంద్రబాబు.

July 12, 2024 3:37 PM | Aditya369 News

ఏపీలో సుదీర్ఘ తీర ప్రాంతం… అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయి: చంద్రబాబు.

ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని... మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని... అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం విశాఖలో నిర్వహించిన సీఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్రంలో నైపుణ్య గణనపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకే స్కిల్ సెన్సెస్ ఉందన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందేలా చూస్తామన్నారు. తయారీ రంగానికి ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక ప్రాంతమన్నారు. విశాఖపట్నంను ఫిన్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ రంగంలో ఏపీలో ఎన్నో అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. ఫార్మా, ఆటోమొబైల్, హార్డ్ వేర్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కు సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని… మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని… అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం విశాఖలో నిర్వహించిన సీఐఐ నేషనల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో నైపుణ్య గణనపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకునేందుకే స్కిల్ సెన్సెస్ ఉందన్నారు.

అంతర్జాతీయ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు పొందేలా చూస్తామన్నారు. తయారీ రంగానికి ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక ప్రాంతమన్నారు. విశాఖపట్నంను ఫిన్ టెక్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. ఆగ్రో ఇండస్ట్రీస్ రంగంలో ఏపీలో ఎన్నో అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. ఫార్మా, ఆటోమొబైల్, హార్డ్ వేర్ రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నట్లు తెలిపారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు