కాకినాడ జిల్లాలోని పుణ్యక్షేత్రం పిఠాపురంలోని శ్రీ రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కు టేశ్వరస్వామి (పాదగయ) ఆలయ నూతనఈవోగా అల్లు వెంకట దుర్గా భవానీ బాధ్యతలు చేపట్టారు. గ్రూప్-2 అధికారి హోదాలో ఆమె ఎగ్జిక్యూటీవ్ అధికారిగా పలు దేవస్థానాల్లో పనిచేశారు. సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయం, కాండ్రకోట నూకాలమ్మ, అంతర్వేది, కాకినాడలో పలు దేవాయాలలో పనిచేశారు. ప్రస్తుతం ఆమె జేవీఓ(నగలు తనిఖీ అధికారి)గా రాజమండ్రిలో పనిచేస్తున్నారు.
పిఠాపురం పాదగయ ఈవోగా పనిచేసిన పులి నారాయణమూర్తి జూన్ 30న పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో దుర్గా భవానీ ని నియమిస్తూ దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన ఈవో ఆలయాన్ని దర్శించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. అనంతరం ఆమె పలు రికార్డులను పరిశీలించి, ఆలయ వివరాలు తెలుసుకున్నారు.
ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఈవో, పరిశుభ్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూపరింటెండెంట్ కె.వి.రమణ కు పలు సూచనలు చేశారు.