Search
Close this search box.

  బీఆర్ఎస్‌కు షాక్..! మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి జంప్..!

June 29, 2024 10:56 AM | Aditya369 News

బీఆర్ఎస్‌కు షాక్..! మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి జంప్..!

బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వరుసగా ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన అధికార పార్టీలో చేరారు. ఇప్పటికే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పటి వరకు ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరారు.

కాలె యాదయ్య చేవెళ్ల నుంచి వరుసగా మూడోసారి గెలిచారు. 2014లో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు. 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున విజయం సాధించారు. గత ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి బీమ్ భరత్‌పై 268 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు