ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన ఆనందం కంటే,,జనం పడ్డ బాధలు,,వాటినిఏలా తొలగించాలన్న ఆలోచనలతో ఇప్పుడు నేతలు సతమతమవుతున్నారు. ఇటీవల పోలవరం సందర్శించిన చంద్రబాబు పోలవరం ఏలాపూర్తి చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి అంటూ బహిరంగంగా చెప్పారు.
గత ప్రభుత్వం చేసిన పనులన్ని దాదాపుగా ఇలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కారు ఉంటే రేషన్ కార్డు తొలగించారు. అది కొత్త కారా..పాత కారా అనేది అనవసరం. ఇప్పుడు ఆకార్ల గోల సీఎం పవన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు చుట్టుకుంది. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సెకండ్ కార్లు ఉపయోగించే వినియోగదారులు తమ పరిస్థితిని సమీక్షించి, సెకండ్ హ్యాండ్ కారు ధరను బట్టి పరిశీలించి, తొలగించిన రేషన్ కార్డులను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
ఎటువంటి కారు ఉండాలో, కారు ఖరీదు, మోడల్ ని బట్టి, కొత్త కారుకే రూల్స్ ఆ లేకపోతే పాత కారుకి రూల్స్ ఉన్నాయా అనేది తేల్చి చెప్పకుండానే ఒక పాత (సెకండ్ హ్యాండ్ )కారు లక్ష రూపాయల్లో కొని రిజిస్ట్రేషన్ చేపించారో లేదో రేషన్ కార్డు గల్లంతయిపోతుందని ఆ కార్ల వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొన్న కారేమో చిన్నది. తీరా రిజిస్ట్రేషన్ చేసుకుంటే కారు ఉంటే రేషన్ కార్డు తొలగించారు. ఓరి దేవుడా ఎందుకులే ఈ గొడవ కారు అమ్మేద్దామనుకుంటే కారు అమ్మిన తర్వాత కార్డు తెల్లకార్డు రావడం లేదు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఎంత సులువుగా జరుగుతుందో అంత తేలికగా పోయిన తెల్ల రేషన్ కార్డు అర్హత తిరిగి రావడం లేదు. దీంతో మధ్య తరగతి కుటుంబాలు తీవ్ర ఆవేదన చెందుతున్నాయని ,ఈ క్రమంలో చాలామంది సెకండ్ హ్యాండ్ కారు జోలికి వెళ్లకుండా ఉన్నారు కూడా…. కొంతమంది ఇక్కడే కారు కొని తెలంగాణలో ఉన్న చుట్టాల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకునే పరిస్థితి వచ్చింది అంటున్నారు సెకండ్ హ్యాండ్ కార్ల వినియోగదారులు. మధ్యతరగతి వారు 1లక్ష 2 లక్షల కారు కొనుక్కొని పరిస్థితి లేకుండా పోయిందని, ఒక వేళ కొనుగోలు చేసుకుని దానికి ఫైనాన్స్ చేసుకున్న పరిస్థితిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవడం లేదని చెబుతున్నారు.
దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లో ఓ మంచినిర్ణయం తీసుకుని సెకండ్ హ్యాండ్ కారు ఉన్నవారికి అర్హులుగా సవరణలు చేసి, కారు ఉంటే రేషన్ కార్డు ఇప్పించవలసిందిగా సెకండ్ హ్యాండ్ కారు వినియోగదారుల విన్నవిస్తున్నారు.