Search
Close this search box.

  థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండస్ట్రీ పై వేధింపుల కేసు కొట్టివేత

థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండస్ట్రీ పై వేధింపుల కేసు కొట్టివేత

థ‌ర్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ పేరు చెబితే ట‌క్కున గుర్తొచ్చేది హ‌స్య న‌టుడు పృథ్వీ. న‌ట‌న‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీ రాజ్ స్వ‌యంశ‌క్తిపై ఎదిగారు. అయితే ఆయ‌న‌కు వ‌చ్చిన కీర్తితోపాటు, ప‌లు వివాదాలు చుట్టు ముట్టి అప‌కీర్తి కూడా మూట‌గ‌ట్టుకున్నారు. వైసీపీకి మ‌ద్ధ‌తిచ్చిన పృథ్వీకి 2019లో టీటీడీ భ‌క్తి ఛాన‌ల్ ఛైర్మ‌న్ గా ప‌నిచేశారు. అయితే అప్ప‌ట్లో ఆయ‌న ఓ మ‌హిళ‌తో స‌ర‌సాలు ఆడిన ఆడియో క‌ల‌క‌లం సృష్టించింది. దీంతో స్వ‌చ్ఛంధంగా ప‌ద‌వికీ రాజీనామా చేశారు. అనంత‌రం పృథ్వీ రాజ్ జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. 2024 ఎన్నిక‌ల్లో జ‌న‌సేన‌కు విస్తృతంగా ప్ర‌చారం చేశారు. కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన పృథ్వీరాజ్ కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ‌పై విరుచుకుప‌డ్డారు. మొత్తంగా జ‌న‌సేన గెలుపులో భాగ‌స్వామి అయ్యారు.

పృథ్వీ రాజ్‌పై ప‌లు వివాదాలు ఉన్న‌ప్ప‌టికీ , అందులో ముఖ్యంగా ఆయ‌న‌ను వ‌ర‌క‌ట్న వేధింపుల కేసు మాత్రం ముప్పుతిప్ప‌లు పెట్టింది. చివ‌ర‌కు ఆయ‌న‌కు భారీ ఊర‌ట క‌లిగింది. నటుడు పృథ్వీరాజ్ పై నమోదైన వరకట్న వేధింపుల కేసును కొట్టివేస్తూ విజయవాడ కోర్టు తీర్పు వెలువరించింది. అదనపు కట్నం కోసం తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారని పృథ్వీ భార్య శ్రీలక్ష్మి ఫిర్యాదుపై సూర్యారావుపేట స్టేషన్లో 2016లో కేసు నమోదైంది. 2017లో రెండో అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్లో ఛార్జిషీట్ దాఖలైంది. విచారణలో నిందితుడిపై నేరారోపణలు రుజువు కాకపోవడంతో కేసును కొట్టేస్తూ న్యాయాధికారి తీర్పునిచ్చారు.

 

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు