Search
Close this search box.

  గ్రీన్ కో..కాస్కో.! కాకినాడ వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి సునీల్ పై ప‌వ‌న్ ఫోక‌స్‌

గ్రీన్ కో..కాస్కో.!

గ్రీన్ కో ప్రాజెక్టు నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ఉప‌ముఖ్య‌మంత్రి

గ్రీన్ కో సంస్థ చేపడుతున్న సంప్రదాయేతర ఇంధన వనరుల ప్లాంట్ల ఏర్పాటులో జరుగుతున్న పర్యావరణ ఉల్లంఘనలపై రాష్ట్ర ఉప‌ముఖ్య‌మంత్రి, పర్యావరణ మంత్రిగా ఉన్న‌ పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈనేప‌థ్యంలోనే ఆయ‌న తాజాగా ఈ ప్రాజెక్టుపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారుల‌ను ఆదేశించ‌డం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

గ్రీన్‌కో క‌థేంటి..!

ఈ గ్రీన్ కో ఎవరిదో కాదు.. చలమలశెట్టి సునీల్ కుటుంబానికి చెందినది. వైఎస్ జగన్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న సునీల్ ఎన్నిక‌ల ముందు ఈ ప్రాజెక్టు ఆధారంగా జ‌గ‌న్‌తో మ‌రింత ముందుకెళ్లార‌నే వార్త‌లు అప్ప‌ట్లో వినిపించాయి. మొద‌ట్లో సునీల్ వైసీపీ ఎంపీ అభ్య‌ర్థిగా ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌న‌ప్ప‌టికీ ఈ ప్రాజెక్టు మ‌హ‌త్యంతోనే ఆయ‌న ఎంపీగా పోటీ చేసిన‌ట్లు చెబుతున్నారు. గ్రీన్ కో ద్వారా వైసీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా అటవీ భూముల్ని కూడా అక్రమించి పనులు చేసార‌న్న ఆరోపణలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డికి బినామీ వాటాలు ఇచ్చారని. అందుకే పెద్ద ఎత్తున భూములు కేటాయించారన్న ఆరోప‌ణ‌ల‌తో గ్రీన్ కో వార్త‌ల్తొకెక్కింది.

గ్రీన్ కో..కాస్కో.!

ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరుతూంటారు చలమలశెట్టి సునీల్. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీలో చేరారు. నాలుగు సార్లు కాకినాడ నుంచి పోటీ చేసి నాలుగుసార్లూ ఘోరంగా ఓడిపోయారు. సునీల్‌కు కాలం కలసి రాలేదు. గత ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని చెప్పినా వైసీపీ అధినేత జగన్.. బెదిరింపులతో కూడిన హెచ్చరికల ద్వారా పోటీ చేయించారని చెబుతున్నారు. ఎన్నికలు ముగిసిన వెంటనే చలమలశెట్టి సునీల్ జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే పవన్ సునీల్‌ను చేర్చుకునే ఉద్దేశంలో లేరని తెలుస్తోంది. అందుకే గ్రీన్ కో అక్రమాలపై ప్రత్యేకమైన నివేదిక అడిగారని అంటున్నారు. ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం ఎన్ని మ‌లుపులు తిరుగుతుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు