70 ఏళ్ల వయసు దాటినా కూడా లోకనాయకుడు కమల్ హాసన్ జోరు ఏమాత్రం తగ్గడం లేదు. యంగ్ హీరోలకు సైతం గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఏకంగా ఆరు భారీ ప్రాజెక్టులను లైన్లో పెట్టి సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారారు.
ఇందులో మూడు సినిమాల్లో హీరోగా నటించబోతుండగా, తన సొంత నిర్మాణ సంస్థ ద్వారా మరో మూడు సినిమాలను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ముందుగా హీరోగా కమల్ హాసన్ చేయబోతున్న సినిమాల విషయానికి వస్తే.. శంకర్ దర్శకత్వంలో ‘భారతీయుడు 3’ ఇప్పటికే లైన్లో ఉంది. మరోవైపు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి ఓ భారీ మల్టీస్టారర్ చేయబోతున్నారు. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక మూడో ప్రాజెక్ట్‌గా ‘చిన్నా’ ఫేమ్ దర్శకుడు ఎస్.యు. అరుణ్ కుమార్‌తో సినిమా చేయబోతున్నారు కమల్. నవంబర్ 7న తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే చెన్నైలో 15 రోజుల మొదటి షెడ్యూల్‌తో పాటు, ఆ తర్వాత తెన్‌కాశీలో రెండో షెడ్యూల్ కోసం చిత్రబృందం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
ఇక నటుడిగానే కాకుండా నిర్మాతగానూ కమల్ హాసన్ తన సత్తా చాటుతున్నారు. తన సొంత బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్పై మరో మూడు క్రేజీ ప్రాజెక్టులను నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ఇలా ఒకేసారి ఆరు సినిమాలతో బిజీగా మారిన కమల్ హాసన్ స్పీడ్ చూసి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. నిజంగా ఈ వయసులో కూడా కమల్ చూపిస్తున్న ఎనర్జీకి యంగ్ హీరోలు సైతం ఆశ్చర్యపోవాల్సిందే!









