Search
Close this search box.

  విజయ్ దేవరకొండ వాయిస్‌తో ఈఎన్‌ఈ రిపీట్ ట్రైలర్.. అంచనాలు పెంచేసిన మేకర్స్..

November 3, 2026 11:59 PM | Aditya369 News

విజయ్ దేవరకొండ వాయిస్‌తో ఈఎన్‌ఈ రిపీట్ ట్రైలర్.. అంచనాలు పెంచేసిన మేకర్స్..

యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న 'ఈ నగరానికి ఏమైంది' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న 'ఈఎన్‌ఈ రిపీట్' ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. విశ్వక్ సేన్ హీరోగా, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించిన మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. మొదటి పార్ట్ చివర్లో విశ్వక్ సేన్, విజయ్ దేవరకొండతో కలిసి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్లు చూపించిన సన్నివేశం నుంచే ఈ కథ కొనసాగుతుంది. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది.

ఈసారి విశ్వక్ సేన్ డైరెక్టర్‌గా మారి సినిమా చేసే ప్రయత్నంలో తన నలుగురు స్నేహితులతో కలిసి బ్యాంకాక్ వెళ్తాడు. అక్కడ ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎదుర్కొనే సరదా సంఘటనలు, ఇబ్బందులు, కామెడీ సన్నివేశాలను ట్రైలర్‌లో ఫన్‌ఫుల్‌గా చూపించారు.

మొదటి భాగంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అదే ఫ్రెండ్స్ గ్యాంగ్ ఈసారి మరింత వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది.

ఈ సినిమాలో విశ్వక్ సేన్‌తో పాటు అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్‌గా కనిపించనున్నారు.

మొదటి భాగం గోవా నేపథ్యంలో తెరకెక్కగా, ఈసారి కథను బ్యాంకాక్ బ్యాక్‌డ్రాప్‌లో చూపించబోతున్నారు. చాలా కాలం తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఇటీవల 'కల్ట్' సినిమాతో సక్సెస్ అందుకున్న విశ్వక్ సేన్, ఇప్పుడు 'ఈఎన్‌ఈ రిపీట్'తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

మరి నవంబర్ 16న విడుదల కానున్న ఈ సినిమా మొదటి భాగం స్థాయిలో నవ్వులు పంచుతుందా? అనేది చూడాలి!

యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘ఈఎన్‌ఈ రిపీట్’ ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. విశ్వక్ సేన్ హీరోగా, తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నవంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించిన మేకర్స్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. మొదటి పార్ట్ చివర్లో విశ్వక్ సేన్, విజయ్ దేవరకొండతో కలిసి షార్ట్ ఫిల్మ్ తీస్తున్నట్లు చూపించిన సన్నివేశం నుంచే ఈ కథ కొనసాగుతుంది. విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ ఆసక్తికరంగా ప్రారంభమవుతుంది.

ఈసారి విశ్వక్ సేన్ డైరెక్టర్‌గా మారి సినిమా చేసే ప్రయత్నంలో తన నలుగురు స్నేహితులతో కలిసి బ్యాంకాక్ వెళ్తాడు. అక్కడ ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎదుర్కొనే సరదా సంఘటనలు, ఇబ్బందులు, కామెడీ సన్నివేశాలను ట్రైలర్‌లో ఫన్‌ఫుల్‌గా చూపించారు.

మొదటి భాగంలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన అదే ఫ్రెండ్స్ గ్యాంగ్ ఈసారి మరింత వినోదాన్ని అందించడానికి సిద్ధమవుతోంది.

ఈ సినిమాలో విశ్వక్ సేన్‌తో పాటు అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్‌గా కనిపించనున్నారు.

మొదటి భాగం గోవా నేపథ్యంలో తెరకెక్కగా, ఈసారి కథను బ్యాంకాక్ బ్యాక్‌డ్రాప్‌లో చూపించబోతున్నారు. చాలా కాలం తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకుడిగా ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి.

ఇటీవల ‘కల్ట్’ సినిమాతో సక్సెస్ అందుకున్న విశ్వక్ సేన్, ఇప్పుడు ‘ఈఎన్‌ఈ రిపీట్’తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

మరి నవంబర్ 16న విడుదల కానున్న ఈ సినిమా మొదటి భాగం స్థాయిలో నవ్వులు పంచుతుందా? అనేది చూడాలి!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు