ధనుష్, మమ్ముట్టి లాంటి ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఓం’ నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో నటిస్తున్న శ్రీలీల పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది.
ఈ సినిమాలో శ్రీలీల ‘రోజా’ అనే పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు, ‘సెంజుదరే’ అనే పాటకు సంబంధించిన చిన్న వీడియోను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ పూర్తి పాట బుధవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పటికే మరో హీరోయిన్ సాయి పల్లవి పాత్రను కూడా చిత్ర బృందం పరిచయం చేసింది. ఇందులో ఆమె ‘నిత్య రెడ్డి’ అనే ఐపీఎస్ అధికారిణిగా నటిస్తున్నారు. ఏపీ కేడర్‌కు చెందిన ఈ పోలీస్ అధికారిణి, ఆ తర్వాత సీబీఐకి బదిలీ అయి ‘ఆపరేషన్ ఓం’ను నడిపించే కీలక బాధ్యతలు చేపడతారు.
ఇక ఈ సినిమాతో తొలిసారిగా ధనుష్, మమ్ముట్టి కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. మమ్ముట్టి ‘కార్తికేయన్’ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనుండగా, ధనుష్ ఎర్రచందనం కూలీగా ప్రేక్షకులను అలరించనున్నారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షా కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ సినిమాను నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ‘ఓం: చాప్టర్ 1’ అనే టైటిల్ పెట్టడంతో, భవిష్యత్తులో మరిన్ని భాగాలు వచ్చే అవకాశం ఉందనే ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో నెలకొంది.









