మలయాళీ నటి మమితా బైజు ప్రస్తుతం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ‘ప్రేమలు’, ‘డ్యూడ్’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌లో అవకాశం దక్కినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్న ‘జై హనుమాన్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో మమితా బైజు కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ముఖ్యంగా ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుండటంతో ‘జై హనుమాన్’పై ఆసక్తి మరింత పెరిగింది. భారీ మైథలాజికల్ ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మమితా బైజు పాత్ర కూడా కథలో కీలకంగా ఉంటుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అయితే మమితా బైజు ఎంపికపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఈ వార్తలు కేవలం సినీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మాత్రమే. ఒకవేళ ఈ వార్త నిజమైతే మమితా బైజు కెరీర్‌లో ‘జై హనుమాన్’ మరో కీలక చిత్రంగా నిలిచే అవకాశం ఉంది.
‘హను-మాన్’ సృష్టించిన అంచనాలకు తోడు రిషబ్ శెట్టి, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌పై ఉన్న ఆసక్తి.. ఇప్పుడు మమితా బైజు పేరు కూడా వినిపించడంతో ‘జై హనుమాన్’ మరింత చర్చనీయాంశంగా మారింది.









