టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శర్వానంద్.. ఇప్పుడు మాస్ డైరెక్టర్ సంపత్ నందితో కలిసి ఓ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాకు ‘భోగి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. తాజాగా మేకర్స్ అదిరిపోయే మాస్ అప్డేట్ ఇచ్చారు.
అక్టోబర్ 4న ‘భోగి’ టీజర్!
శర్వానంద్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. అక్టోబర్ 4న ‘భోగి’ టీజర్‌ను విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
అంతేకాదు.. “శర్వా సంపత్ బ్లడ్ ఫెస్ట్” అనే మాస్ హ్యాష్‌ట్యాగ్‌తో ఈ అప్డేట్ను విడుదల చేయడంతో సినిమాపై మరింత హైప్ పెరిగింది.
సంపత్ నంది సినిమాల్లో ఉండే హై-వోల్టేజ్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్‌కు శర్వానంద్ స్టైల్ కూడా యాడ్ అవ్వడంతో ఈ కాంబినేషన్‌పై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.
ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై రాధామోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
మరి సంపత్ నంది మార్క్ మాస్ యాక్షన్‌తో శర్వానంద్ ఎలా కనిపించబోతున్నాడు? టీజర్లో ఎలాంటి యాక్షన్ చూపించబోతున్నారు? అన్నది తెలియాలంటే అక్టోబర్ 4 వరకు వెయిట్ చేయాల్సిందే.









