సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ధర్మన్’. ‘జైలర్ 2’ తర్వాత రజినీకాంత్ నటిస్తున్న ఈ సినిమాకు అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
ఈ సినిమాలో రాశీ ఖన్నా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాశీ ఖన్నా చేసిన ఓ సోషల్ మీడియా పోస్ట్‌తో ఈ సినిమాలో టాలీవుడ్ హీరో రామ్ పోతినేని కూడా ఉన్నారనే విషయం బయటకు వచ్చింది. రామ్, రజినీకాంత్‌తో కలిసి ఉన్న ఫొటోను ఆమె షేర్ చేయడం.. ఆ తర్వాత ఆ పోస్ట్ వైరల్ కావడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్‌గా మారింది.
ధర్మన్‌లో శ్రీలీల కూడా?
ఇక ఇప్పుడు ‘ధర్మన్’ విషయంలో మరో క్రేజీ న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో రాశీ ఖన్నాతో పాటు శ్రీలీల కూడా కీలక పాత్రలో నటిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
మైసూరు షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చిన ఓ వీడియోలో శ్రీలీలను పోలిన ఓ నటి కనిపించడంతో.. ఆమె ‘ధర్మన్’లో భాగమనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే శ్రీలీల నటిస్తున్న విషయాన్ని మేకర్స్ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.
మరోవైపు రామ్ పోతినేని కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో ఉన్నట్లు తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. అయితే ఆయన పాత్రకు సంబంధించిన వివరాలు మాత్రం ఇంకా రివీల్ కాలేదు.
ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. రామ్, శ్రీలీల ఇద్దరూ ఇటీవల ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో కలిసి కనిపించారు. ఇప్పుడు రజినీకాంత్ ‘ధర్మన్’లో కూడా వీరిద్దరి పేర్లు వినిపిస్తుండటంతో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
రజినీకాంత్‌ను ‘ది డెడ్లీ డాక్టర్’గా చూపించిన ఫస్ట్ లుక్ ఇప్పటికే సినిమాపై క్యూరియాసిటీ పెంచింది. ప్రస్తుతం మైసూరులో షూటింగ్ కొనసాగుతోంది.
మరి నిజంగానే రామ్, శ్రీలీల ఇద్దరూ ‘ధర్మన్’లో కీలక పాత్రల్లో నటిస్తున్నారా? వాళ్ల పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? అనేది అధికారిక ప్రకటన వస్తేనే క్లారిటీ వస్తుంది.









