పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఫౌజీ’పై ఎట్టకేలకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నాడు.
ఇప్పటికే ఈ సినిమాను డిసెంబర్ 3న గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే గత కొంతకాలంగా ‘ఫౌజీ’ అనుకున్న తేదీకి రావడం లేదని, సినిమా వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు ఇండస్ట్రీలో వైరల్ అయ్యాయి.
తాజాగా ఈ వార్తలపై నిర్మాత రవి శంకర్ క్లారిటీ ఇచ్చారు. ‘ది ప్యారడైజ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన ఆయన.. ‘ఫౌజీ’ రిలీజ్ కాస్త ఆలస్యం అవుతుందని వెల్లడించారు. అనుకున్న సమయానికి కాకుండా సినిమా కొద్దిగా లేటుగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలిపారు.
అంతేకాదు.. ప్రభాస్ కెరీర్‌లో ‘బాహుబలి’ తర్వాత ఆ స్థాయిలో నిలిచే సినిమా ‘ఫౌజీ’ అవుతుందనే నమ్మకాన్ని కూడా నిర్మాత వ్యక్తం చేశారు. దీంతో డిసెంబర్ 3న ‘ఫౌజీ’ విడుదల కావడం లేదనే విషయం దాదాపుగా క్లారిటీ అయిపోయింది.
ఇక ఇప్పుడు అందరి దృష్టి కొత్త రిలీజ్ డేట్‌పైనే ఉంది. ‘ఫౌజీ’ కొత్త విడుదల తేదీని మేకర్స్ ఎప్పుడు ప్రకటిస్తారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
- ఈ సినిమాలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తుండగా.. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మిస్తోంది. మరి హను రాఘవపూడి–ప్రభాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ ఎలాంటి విజువల్ ట్రీట్ ఇవ్వబోతుందో చూడాలి.








