Search
Close this search box.

  వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌పై క్లారిటీ.. అక్టోబర్ 2న వచ్చేస్తున్నాడు..!

September 5, 2026 11:03 PM | Aditya369 News

వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్‌పై క్లారిటీ.. అక్టోబర్ 2న వచ్చేస్తున్నాడు..!

ఇటీవల కాలంలో సినిమాల విడుదల తేదీలను ప్రకటించిన తర్వాత కూడా చివరి నిమిషంలో వాయిదా పడటం సాధారణంగా మారిపోయింది. దీంతో ఇప్పటికే విడుదల తేదీ ప్రకటించిన సినిమాలపై కూడా ప్రేక్షకుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే విక్టరీ వెంకటేష్ నటిస్తున్న ఆదర్శ కుటుంబం సినిమా విడుదల తేదీపై కూడా సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ అయ్యాయి.
ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ గతంలోనే అధికారికంగా ప్రకటించారు. అయితే విడుదలకు సమయం దగ్గరపడుతున్నా సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో మూవీ వాయిదా పడే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. అంతేకాకుండా కొత్త విడుదల తేదీపై కూడా పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
అయితే ఈ వార్తలపై తాజాగా నిర్మాత సూర్యదేవర నాగ వంశీ స్పందించి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆదర్శ కుటుంబం సినిమా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. అక్టోబర్ 2న గ్రాండ్‌గా సినిమాను విడుదల చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు.
తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా నాగ వంశీ స్పందిస్తూ.. ఆదర్శ కుటుంబం సినిమా గురించి అభిమానులు ప్రతిరోజూ అడుగుతున్నారని, వారి ఆసక్తిని తాము అర్థం చేసుకున్నామని తెలిపారు. అప్డేట్స్ ఇవ్వడంలో ఆలస్యం జరిగినందుకు క్షమాపణలు కూడా చెప్పారు. ఇక రాబోయే నెల రోజుల పాటు సినిమాకు సంబంధించిన వరుస సర్ప్రైజ్‌లు ఉంటాయని వెల్లడించారు.
వచ్చే వారం ప్రారంభంలోనే ఆదర్శ కుటుంబం టీజర్‌ను విడుదల చేయనున్నట్లు నాగ వంశీ తెలిపారు. రెండో వారంలో ఫస్ట్ సింగిల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇక మూడో వారంలో థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించారు. దీంతో వెంకటేష్ అభిమానులకు వరుస అప్డేట్స్‌తో పాటు సినిమా విడుదలపై కూడా క్లారిటీ వచ్చేసింది.
ముందుగా ప్రకటించినట్టుగానే గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఆదర్శ కుటుంబం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా వాయిదా పడుతుందంటూ వచ్చిన వార్తలకు నిర్మాత నాగ వంశీ చెక్ పెట్టారు. విడుదల తేదీపై స్పష్టత రావడంతో వెంకటేష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వెంకటేష్, శ్రీనిధి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రిలీజ్‌కు ముందే వరుస అప్డేట్స్‌తో సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.y

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు