Search
Close this search box.

  అల్లు అర్జున్ ‘రాకా’లోకి మరో స్టార్ హీరోయిన్..?

August 25, 2026 7:20 PM | Aditya369 News

అల్లు అర్జున్ ‘రాకా’లోకి మరో స్టార్ హీరోయిన్..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ‘రాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకొనే మెయిన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే.

తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. మలయాళ, తమిళ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఐశ్వర్య లక్ష్మి కూడా ‘రాకా’లో భాగం కానున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ఆమె నెగెటివ్ షేడ్స్ ఉన్న డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ప్రస్తుతం ముంబైలో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. తదుపరి షెడ్యూల్‌లో ఐశ్వర్య లక్ష్మి కూడా షూటింగ్‌లో పాల్గొననున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్య లక్ష్మి పాత్ర కూడా కీలకంగా ఉండబోతుందనే వార్త సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది.

విభిన్నమైన కథలు, ప్రయోగాత్మక పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య లక్ష్మి.. ‘రాకా’లో ఎలాంటి పాత్రలో కనిపించనుందనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు