దర్శకుడు త్రివిక్రమ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ భుజం గాయం కారణంగా షూటింగ్ షెడ్యూల్ వాయిదా పడటంతో, ఈ సమయాన్ని త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ను మరింత పర్ఫెక్ట్ చేసేందుకు ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.
కథలో కీలక మార్పులు చేయడంతో పాటు, తెలుగు తెరపై ఇప్పటివరకు చూడని ఓ భారీ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసేలా త్రివిక్రమ్ ప్రత్యేకంగా వీఎఫ్‌ఎక్స్‌పై కూడా దృష్టి పెడుతున్నారట. సినిమా విజువల్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో ముందుగానే అన్ని అంశాలను పక్కాగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
‘డ్రాగన్’ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా కావడం, ఆయన కెరీర్‌లోనే భారీ ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశం ఉండటం, ముఖ్యంగా మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందనున్న పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. అంతేకాదు, ఈ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా కూడా ప్రచారంలో ఉంది.
ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి కథను ఆధారంగా చేసుకుని, ఆ పాత్రలోని దైవత్వాన్ని మరింత బలంగా చూపించేలా స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. కథ, పాత్రలు, విజువల్స్ ఇలా ప్రతి విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట త్రివిక్రమ్.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కనుంది. మరి ఎన్టీఆర్–త్రివిక్రమ్ కాంబినేషన్ ఈసారి ఎలాంటి విజువల్ వండర్‌ను అందించబోతుందో చూడాలి.









