Search
Close this search box.

  స్పెషల్ సాంగ్‌తో మెగా ఫ్యాన్స్‌కు ట్రీట్.. చిరు 158పై భారీ హైప్..!

August 17, 2026 8:24 PM | Aditya369 News

స్పెషల్ సాంగ్‌తో మెగా ఫ్యాన్స్‌కు ట్రీట్.. చిరు 158పై భారీ హైప్..!

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి కెరీర్‌లో 158వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్‌డేట్ ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. రామ్–లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఫైటర్లతో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఇక వచ్చే వారం నుంచి సినిమాలోని ఓ స్పెషల్ సాంగ్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.

ఈ స్పెషల్ సాంగ్‌లో చిరంజీవి సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపించనున్నారని టాక్. ఇప్పటికే ఈ లుక్‌ను మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఈ పాటతో మెగా అభిమానుల్లో సినిమాపై అంచనాలు మరింత పెరగడం ఖాయమనే మాట వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాలో చిరంజీవి పాత్రలో అనేక వేరియేషన్స్ ఉండనున్నాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కథలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందట. ఇప్పటివరకు చిరంజీవిని చూడని సరికొత్త కోణంలో చూపించాలనే ఉద్దేశంతో బాబీ ఈ కథను రూపొందించినట్లు సమాచారం.

‘వాల్తేరు వీరయ్య’ తర్వాత చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాన్ని సృష్టిస్తుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore