న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘దసరా’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కయాదు లోహర్ హీరోయిన్గా నటిస్తుండగా, సోనాలి కులకర్ణి, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా విడుదలైన ‘ది ప్యారడైజ్’ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నాని ఇప్పటివరకు కనిపించని అత్యంత వైలెంట్ అవతార్‌లో కనిపించగా, శ్రీకాంత్ ఓదెల టీజర్‌ను పూర్తి మాస్, ఇంటెన్స్ యాక్షన్‌తో కట్ చేశారు. ఇందులో వినిపించిన డైలాగ్స్, విజువల్స్ సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచేలా ఉన్నాయి.
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్‌కు మంచి స్పందన లభించగా, తాజా టీజర్‌తో సినిమాపై హైప్ మరోస్థాయికి చేరింది. నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చిత్రం 2026 సెప్టెంబర్ 24న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, స్పానిష్, ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.









