టాలీవుడ్లో నటుడిగా, నిర్మాతగా, కంటెంట్ ఎంపికలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రానా దగ్గుబాటి.. ఇప్పుడు మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలిచారు. గత కొంతకాలంగా హీరోగా పెద్దగా సినిమాలు చేయని రానా.. కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తాజా సమాచారం ప్రకారం.. దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘జై హనుమాన్’ చిత్రంలో రానా కీలక పాత్రలో నటిస్తున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో బలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో కూడా ఆయన పాల్గొన్నట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
అంతేకాదు.. ఈ చిత్రంలో రానా ఓ పవర్ఫుల్ విలన్ పాత్రలో కనిపించే అవకాశముందని కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయినప్పటికీ కథలో ఆయన పాత్ర ఎంతో కీలకంగా ఉండబోతుందనే ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది.
‘హనుమాన్’ సినిమాతో దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ప్రశాంత్ వర్మ.. ఇప్పుడు ‘జై హనుమాన్’ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో తేజ సజ్జా తన పాత్రను కొనసాగిస్తుండగా.. హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కనిపించనున్న విషయం ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేసింది.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం విజువల్ ఎఫెక్ట్స్, మైథాలజికల్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్‌లకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ రూపొందుతోందని సమాచారం. ‘హనుమాన్’ విజయానంతరం దాదాపు రెండేళ్ల పాటు స్క్రిప్ట్‌పై పనిచేసిన ప్రశాంత్ వర్మ.. ఈ సినిమాతో మరోసారి భారీ విజయాన్ని అందుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
అన్ని పనులు అనుకున్న ప్రకారం పూర్తైతే 2027 రెండోార్థంలో ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. అయితే రానా పాత్రతో పాటు విడుదల తేదీపై వస్తున్న ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.









